Pawan Kalyan: అక్కడ బ్రేక్‌ వేస్తే..ఇక్కడ చిక్కే! | Pawan Kalyan Movie Updates And Announcements Will Postponed Due To Election Campaigns? - Sakshi
Sakshi News home page

Pawan Kalyan: అక్కడ బ్రేక్‌ వేస్తే..ఇక్కడ చిక్కే!

Mar 23 2024 1:55 PM | Updated on Mar 23 2024 5:01 PM

BJP Brakes Pawan Kalyan Election Campaign - Sakshi

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తన భార్య గీతకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున శివమొగ్గ ఎంపీ స్థానం నుంచి గీత పోటీ చేస్తోంది. తన భార్యకు మద్దతుగా హీరో శివరాజ్‌కుమార్‌ కాంగ్రెస్‌ గెలుపు కోసం ప్రచారం ప్రారంభించారు. శివరాజ్‌ కుమార్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్‌ పెంచుకోవాలనుకున్న కాంగ్రెస్‌ స్పీడ్‌కు కర్ణాటక బీజేపీ బ్రేకులు వేసే పనిలో ఉంది. శివరాజ్‌ కుమార్‌ టార్గెట్‌గా కన్నడ చిత్రపరిశ్రమలో ఆయనకు సంబంధించిన సినిమాలు, ప్రకటనలు, హోర్డింగ్స్‌ను ఎక్కడా కనిపించకుండా నిషేధించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కర్ణాటక బీజేపీ ఫిర్యాదు చేసింది.

లోక్ సభ ఎలక్షన్స్‌ పూర్తయ్యే వరకు శివరాజ్ కుమార్ సినిమాలు, ప్రకటనలు, హోర్డింగులను ప్రదర్శించకుండా ఆదేశించాలని బీజేపీ తాజాగా కోరింది. బీజేపీ ఫిర్యాదును అక్కడి ఎన్నికల కమిషన్‌ అమలు చేస్తే ఏపీలో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన సినిమాలు, టీజర్‌లు, ట్రైలర్‌లు, ప్రకటనలు వంటి వాటిని కూడా నిషేధించాల్సి వస్తుంది. కన్నడలో శివరాజ్ కుమార్ కూడా పాపులర్‌ హీరో.. ఆయన గురించి బీజేపీ ఎలాంటి ఫిర్యాదు చేసిందో ఇప్పుడు ఏపీలో కూడా అవన్నీ పవన్‌కు వర్తిస్తాయి అనేది పాయింట్‌.

Advertisement
 
Advertisement
Advertisement