ఆ ఇద్దరు తప్ప అందరూ నామినేషన్‌లోనే! | Bigg Boss Telugu 6: These Are Nominated In Seventh Week | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ఏడోవారం నామినేషన్‌లో ఉన్నది ఎవరెవరంటే?

Oct 17 2022 3:59 PM | Updated on Oct 17 2022 4:29 PM

Bigg Boss Telugu 6: These Are Nominated In Seventh Week - Sakshi

తను ఫ్రెండ్‌ అనుకున్న శ్రీసత్య కూడా వేరే ఆప్షన్‌ లేదంటూ రేవంత్‌నే నామినేట్‌ చేసింది. ఇనయ బిహేవియర్‌ నచ్చలేదంటూ ఆమెను నామినేషన్‌లోకి పంపాడు శ్రీహాన్‌.

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో ప్రస్తుతం పదిహేను మంది మిగిలారు. వీరిలో నుంచి ఒకరిని బయటకు పంపించేందుకు నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఏదైనా టాస్క్‌ ద్వారా కాకుండా ఇంటిసభ్యులు కారణాలు చెప్పి మిగతావారిని నామినేట్‌ చేశారు. ఈ క్రమంలో కెప్టెన్‌ రేవంత్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. తన కెప్టెన్సీలో బిగ్‌బాస్‌ రూల్స్‌ పక్కనపెట్టి తనే ఆదమరిచి నిద్రపోయాడంటూ నామినేసన్‌ ఓట్లు గుద్దారు. తను ఫ్రెండ్‌ అనుకున్న శ్రీసత్య కూడా వేరే ఆప్షన్‌ లేదంటూ రేవంత్‌నే నామినేట్‌ చేసింది. ఇనయ బిహేవియర్‌ నచ్చలేదంటూ ఆమెను నామినేషన్‌లోకి పంపాడు శ్రీహాన్‌.

నువ్వు మంచివాడిగా ఎలా ఉన్నావో అదే పేరుతో బయటకు వెళ్లిపోతే బాగుందని బాలాదిత్యకు ఓటేసింది గీతూ. సిస్టర్‌ అనుకున్న గీతూ తను వెళ్లిపోవాలని కోరుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఆదిత్య. హౌస్‌ మంచి కోసం తాను పాటుపడుతుంటే తననే పంపించేయాలని చూస్తున్నారని బాధపడ్డాడు. చూస్తుంటే గీతూ, కెప్టెన్‌ సూర్య మినహా మిగతా అందరూ నామినేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: గీతూ జిడ్డు.. రేవంత్‌ అయితే.. : సుదీప

Advertisement
 
Advertisement
Advertisement