Bigg Boss 7 Telugu: ఈ సీజన్ కాబోయే విన్నర్ అతడేనా? ఒకవేళ లెక్కలు మారితే!

Bigg Boss 7 Telugu Winner Details Amardeep And Prashanth - Sakshi

బిగ్‌బాస్ 7వ సీజన్ చివరకొచ్చేసింది. ప్రస్తుతం 14వ వారం నడుస్తోండగా, మరో 10 రోజుల్లో షో పూర్తి అయిపోతుంది. ఈ క్రమంలోనే విన్నర్ ఎవరవుతారనే కుతుహలం ఉండటం పక్కా. అందుకు తగ్గట్లే నిర్వహకులు.. ఉన్న ఏడుగురితో గేమ్స్ అవీఇవీ అని టైమ్ పాస్ చేస్తున్నారు. కానీ టైటిల్ రేసులో మాత్రం ముగ్గురే ఉన్నారు.

(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?)

మిగతా సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్‌బాస్ అనుకున్నంత ఇంట్రెస్ట్ లేకుండానే సాగుతోంది. శివాజీ బ్యాచ్, సీరియల్ బ్యాచ్.. ఒకరిపై ఒకరు అరుచుకోవడం తప్పితే ఓ ఎంటర్‌టైన్‌మెంట్ సరిగా లేదు, ఓ లవ్ ట్రాక్ లేదు. ఎమోషనల్‌గా ఫీలయ్యే సంఘటన లేదు. ఎలాగోలా ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేస్తున్నారు తప్పితే చాలా బోర్ కొట్టించేస్తున్నారు. ఏదైతేనేం షో చివరకు వచ్చేశాం. విజేత ఎవరనేది మరో 10 రోజుల్లో తేలిపోతుంది.

అయితే గడిచిన వీకెండ్ సందర్భంగా నిర్వహకులు ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఈ రెండు వారాలు కూడా ఓటింగ్ లైన్స్ తెరుచుకునే ఉంటాయని, ఎక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్.. బిగ్‌బాస్ 7 విజేతగా నిలుస్తారని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఓటింగ్ నంబర్స్ చూసుకుంటే.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ 34 శాతం ఓట్లతో టాప్ లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ బావతో 'యానిమల్' బ్యూటీ డేటింగ్?)

ప్రశాంత్ తర్వాత శివాజీ, అమర్‌దీప్ దాదాపు 20 శాతం ఓటింగ్ పర్సంటేజ్‌తో ఉన్నారు. ఆ తర్వాత వరసగా యావర్, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లిస్టులోని తొలి ముగ్గురిలోనే స్థానాలు అటుఇటు మారాలి తప్పితే మిగతా వాళ్లు.. టాప్-3లోకి వచ్చే ఛాన్సులు తక్కువ. అంటే ప్రశాంత్, శివాజీ, అమర్‌లలో ఎవరో ఒకరే విజేత అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయి.

ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే విజేత అని బిగ్‌బాస్ నిర్వహకులు చెప్పారు. కానీ రాబోయే 10 రోజుల్లో ఏమైనా జరగొచ్చు. లెక్కలు మార్చొచ్చు. ఎన్ని లెక్కలు మారినా సరే ప్రశాంత్ లేదంటే అమర్ విజేత అయితే పెద్దగా సమస్య ఉండదు. శివాజీకి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మిగతావాళ్లతో పోలిస్తే.. మనోడు చాలా విషయాల్లో పూర్. ఏదో మాటలతో లాక్కోచ్చేస్తున్నాడు అంతే! ఏదైతేనేం టైటిల్ కోసం పోటీ మంచిగా నడుస్తోంది. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారని మీరనుకుంటున్నారు?

(ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్‌స్పెక్టర్‌!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-12-2023
Dec 08, 2023, 10:35 IST
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో వాసంతి కృష్ణన్‌కు మంచి గుర్తింపు తెచ్చుకుంది. షోలో తన అందచందాలతో మరింత పాపులారిటీని...
08-12-2023
Dec 08, 2023, 07:56 IST
బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్‌లో 94 రోజులు గడిచిపోయాయి. దాదాపు శుభం కార్డు పడే సమయం వచ్చేసింది.  ఉల్టా పుల్టా...
07-12-2023
Dec 07, 2023, 19:35 IST
తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు హౌస్‌లో కేవలం ఏడుగురు కంటెస్టెంట్స్...
07-12-2023
Dec 07, 2023, 11:00 IST
పాపులర్ రియాల్టీ షో అయిన 'బిగ్ బాస్' ద్వారా అసిమ్ రియాజ్, హిమాన్షి ఖురానా పాపులర్‌ అయ్యారు. హిందీలో 13వ...
06-12-2023
Dec 06, 2023, 22:39 IST
బిగ్‌బాస్ 7వ సీజన్ అయిపోవడానికి ఇంకా 10 రోజులే ఉంది. ఇలాంటి టైంలో షోని ఎంత ఇంట్రెస్ట్‌గా డిజైన్ చేయాలి....
05-12-2023
Dec 05, 2023, 23:02 IST
బిగ్‌బాస్ 14వ వారం నామినేషన్స్ ఒకేరోజులో పూర్తయ్యాయి. కానీ అమర్-ప్రశాంత్ గొడవ మాత్రం రాత్రంతా నడుస్తూనే ఉంది. 'ఓట్ ఫర్...
05-12-2023
Dec 05, 2023, 19:12 IST
బిగ్‌బాస్ 7 చివరకొచ్చేసింది. 14వ వారానికి సంబంధించిన నామినేషన్స్ పూర్తయ్యాయి. దీంతో ఈ వారం బిగ్‌బాస్ ఏం ప్లాన్ చేశాడా?...
05-12-2023
Dec 05, 2023, 17:16 IST
బిగ్‌బాస్ 7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బాగానే ఆడుతున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే అలా లేకపోతే 14వ...
04-12-2023
Dec 04, 2023, 23:40 IST
బిగ్‌బాస్ చిట్టచివరి నామినేషన్స్ అయిపోయాయి. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండాల్సిన ఈ ప్రక్రియ.. చాలా సిల్లీగా నడిచింది. ఎప్పటిలానే పనికిమాలిన సీరియల్...
04-12-2023
Dec 04, 2023, 18:12 IST
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న రియాలిటీ షో చివరిదశకు చేరుకుంది. మరో వారంలో గ్రాండ్ ఫినాలేకు తెరలేవనుంది. గతవారం గౌతమ్ ఎలిమినేట్...
04-12-2023
Dec 04, 2023, 12:12 IST
కానీ ఈసారి నామినేషన్స్‌ను ఇంటిసభ్యుల చేతిలో పెట్టాడు బిగ్‌బాస్‌. ఎవరిని ఇంటి నుంచి బయటకు పంపించాలనుకుంటారో వారి ముఖాలను టైల్స్‌పై...
03-12-2023
Dec 03, 2023, 23:30 IST
బిగ్‌బాస్ 7 గురించి హోస్ట్ నాగార్జున ఏమో గొప్పలు చెబుతున్నాడు. రియాలిటీలో మాత్రం అస్సలు అలా లేదు. తాజా ఎపిసోడే...
02-12-2023
Dec 02, 2023, 23:40 IST
బిగ్‌బాస్ 7వ సీజన్‌లో మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఈ వారం ఓ మాదిరి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. కాకపోతే శివాజీ...
02-12-2023
Dec 02, 2023, 18:46 IST
కాబట్టి ఆమెకు బదులుగా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ను పంపించే ప్లాన్‌ చేశారట! టాప్‌5లో ఉండేందుకు అర్హత ఉన్న గౌతమ్‌ కృష్ణను ఎలిమినేట్‌...
02-12-2023
Dec 02, 2023, 16:23 IST
బిగ్‌బాస్‌ షోలోకి వెళ్లేముందు కూడా తనకు విపరీతమైన బ్యాక్‌పెయిన్‌ ఉంది. హౌస్‌లోకి వెళ్లే ఒకరోజు ముందు కూడా అతడికి ఫిజియోథెరపీ...
01-12-2023
Dec 01, 2023, 22:59 IST
గత కొన్నిరోజుల నుంచి జరుగుతున్న 'టికెట్ టూ ఫినాలే' రేసు పూర్తయింది. ఎవరూ ఊహించని విధంగా అర్జున్.. చివరి వరకు...
01-12-2023
Dec 01, 2023, 14:12 IST
అంటే అతడు టాప్‌ 5లో అడుగుపెట్టేసినట్లే అనుకోకండి.. తనముందు ఎలిమినేషన్‌ గండం ఉంది. ఈవారం ఎలిమినేషన్‌ దాటుకుని ముందుకు వస్తేనే...
01-12-2023
Dec 01, 2023, 09:48 IST
యావర్‌ ఒక కీ తీసుకుని అది రాకపోవడంతో కింద పడేశాడు. దీంతో అర్జున్‌కు బాక్స్‌లో ఎంత వెతికినా సరైన కీ...
30-11-2023
Nov 30, 2023, 15:28 IST
తను కొత్తిల్లు కొనుక్కుంది. గృహప్రవేశానికి తారలను, స్నేహితులను ఆహ్వానించింది. ఈ క్రమంలో నూతన గృహప్రవేశానికి వచ్చిన దీప్తి సునయన తదితరులు...
29-11-2023
Nov 29, 2023, 19:48 IST
బిగ్‌బాస్ గత సీజన్స్ మాటేమో గానీ ఈసారి మాత్రం బ్యాచ్‌ల గోల ఎక్కువైంది. అంతెందుకు రీసెంట్ వీకెండ్ ఎపిసోడ్‌లో స్వయంగా...



 

Read also in:
Back to Top