'బిగ్‌బాస్ 7'లో తొలివారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా? | Bigg Boss 7 Telugu First Week Elimination And Voting | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Elimination: ఓటింగ్‌లో దూసుకుపోతున్న ఆ ఒక్కడు.. చివర్లో ఆమె!

Sep 6 2023 9:04 PM | Updated on Sep 8 2023 3:21 PM

Bigg Boss 7 Telugu First Week Elimination And Voting - Sakshi

బిగ్‌బాస్ 7లో అప్పుడే గొడవలు స్టార్టయిపోయాయి. వచ్చిన రెండో రోజే నామినేషన్స్ మొదలుపెట్టేసరికి.. ఇంట్లో ఉన్న 14 మంది ఒకరిపై ఒకరు కౌంటర్స్ వేసుకున్నారు. వాళ్లకు ఇంట్లో ఉండే అర్హత లేదు అని చెప్పి.. ఒక్కో వ్యక్తి తలో ఇద్దరిని నామినేట్ చేశారు. ప్రస్తుతం ఎనిమిది సభ్యులపై నామినేషన్ కత్తి వేలాడుతోంది. అయితే ఈ వారం.. హౌస్ నుంచి వెళ్లిపోయేది ఓ లేడీ కంటెస్టెంట్ అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: Bigg Boss 7: అందరితోనూ శోభా గొడవలు.. అడ్డంగా దొరికిపోయిన తేజ!)

నాగార్జున హోస్ట్ గా బిగ్‌బాస్ కొత్త సీజన్ షూరు అయిపోయింది. తొలిరోజు అందరూ హ్యాపీగా కలిసిపోయారు, మాట్లాడుకున్నారు. ఇక నామినేషన్స్ టాపిక్ వచ్చేసరికి.. వాళ్లపై వీళ్లు, వీళ్లపై వాళ్లు చాడీలు చెప్పుకొన్నారు. మొత్తంగా శోభాశెట్టి, రతిక, ప్రిన్స్, ప్రశాంత్, కిరణ్, గౌతమ్, షకీలా, దామిని.. నామినేషన్స్ లో ఉన్నట్లు బిగ్ బాస్ ప్రకటించారు. అయితే వీళ్లలో తొలివారం ఎలిమినేట్ అయ్యేది ఎవరా అని ఇప్పటికే ప్రిడిక్షన్స్ మొదలైపోయాయి.

మరోవైపు నామినేషన్స్‌లో ఉన్నవాళ్లని సేవ్ చేసేందుకు ఓటింగ్ కూడా జోరుగా సాగుతోంది. అయితే లిస్టులో ఉన్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌కి ఎక్కువగా ఓట్లు పడుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో వరసగా శోభా, రతిక, గౌతమ్, షకీలా, ప్రిన్స్, దామిని ఉన్నారు. ఇక చివరి స్థానంలో కిరణ్ రాథోడ్ ఉన్నారు. కిరణ్‌కి భాష సమస్య కావడంతో అందరిలోనూ ఈమె ఎక్కువగా కలవలేకపోతున్నారు. అలా అని ఇప్పుడే ఏం చెప్పలేం. మరి ఈ వీకెండ్‌లో కిరణ్.. ఎలిమినేట్ అవుతుందా ఇంకెవరైనా బయటకెళ్లిపోతారా అనేది చూడాలి.

(ఇదీ చదవండి: నా దిల్‌ నీకిచ్చేస్తానన్న రతిక.. ఎగిరి గంతేసిన పల్లవి ప్రశాంత్‌)

Advertisement
 
Advertisement
Advertisement