నోరు జారిన షణ్ముఖ్‌, హర్ట్‌ అయిన శ్వేత! | Bigg Boss 5 Telugu: Shanmukh Comment On Swetha In Task Gone Wrong | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: శ్వేతను లవ్‌లో దింపే పనిలో షణ్ముఖ్‌, అంతలోనే ఆ మాటతో..

Sep 22 2021 5:01 PM | Updated on Sep 23 2021 3:28 PM

Bigg Boss 5 Telugu: Shanmukh Comment On Swetha In Task Gone Wrong - Sakshi

Bigg Boss 5 Telugu: నామినేషన్స్‌తో బిగ్‌బాస్‌ హౌస్‌ నిప్పులగుండంగా మారింది. దీన్ని చల్లార్చేందుకు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల మధ్య సరదా డ్రామా క్రియేట్‌ చేసేందుకు 'హైదరాబాద్‌ అమ్మాయి - అమెరికా అబ్బాయి' అనే ఫన్నీ టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్‌ కొంత నీరసంగానే సాగుతోంది. అయితే పెళ్లి సంబంధం చుట్టూ కొనసాగే ఈ టాస్క్‌లో షణ్ముఖ్‌, శ్వేత, లోబోల మధ్య ట్రయాంగిల్‌ లవ్‌ ట్రాక్‌ నడుస్తోంది. వీళ్ల మద్య వచ్చే సన్నివేశాలు ఎంతో కామెడీగా ఉంటున్న సమయంలో షణ్ముఖ్‌ పొరపాటున అనేసిన ఒక్క కామెంట్‌తో శ్వేత అతడిపై ఫైర్‌ అయింది.

'పెళ్లి చేసుకుందాం, ఇక నుంచి నేను నీ వాడిని, నువ్వు నాదానివి' అని షణ్ముఖ్‌ అనడంతో సిగ్గుతో ముడుచుకుంటూనే సరే అనేసింది శ్వేత. ఆ తర్వాత 'నువ్వంటే నాకు పిచ్చి, నువ్వే నా ఊపిరి..' అంటూ లోబో ఐ లవ్‌ యూ చెప్పగా అతడికీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది శ్వేత. ఇది చూసి హర్ట్‌ అయిన షణ్ముఖ్‌.. 'ఏదైనా అందామంటే ముఖం మీద పెయింట్‌ వేసి కొడుతుంది' అని నోరు జారాడు. దీంతో ఫీలైన శ్వేత.. 'అది ఫన్నీ కాదు' అంటూ ఒక్కసారిగా సీరియస్‌ అయింది. ఆమెను అనవసరంగా బాధపెట్టాననుకున్న షణ్నూ తన నోటి దురదను తిట్టుకుంటూ శ్వేతను బుజ్జగించేందుకు ప్రయత్నించాడు. వాష్‌రూమ్‌ దగ్గర ఉన్న ఆమెను క్షమించమని కోరాడు. కానీ ఆమె కోపం మాత్రం అస్సలు తగ్గినట్లు కనిపించలేదు. మరి ఈ గొడవ ఎటువైపు దారి తీస్తుంది అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే!

Advertisement
 
Advertisement
Advertisement