Ananya Panday: లైగర్‌ బ్యూటీని లెక్కచేయని షారుక్‌ ఖాన్‌ తనయుడు, వీడియో వైరల్‌

Aryan Khan Ignores Ananya Panday Video Goes Viral - Sakshi

సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా ఫీలింగ్స్‌ ఉంటాయి. లైగర్‌ హీరోయిన్‌ అనన్య పాండేకు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ అంటే క్రష్‌ అని ఇటీవలే ఓ షోలో తన మనసులోని మాట బయటపెట్టింది. ఇటీవలే అనన్య.. 'మజా మా' సినిమా స్క్రీనింగ్‌కు వెళ్లగా అక్కడ ఆర్యన్‌ తారసపడ్డాడు. కానీ అతడు ఈ బ్యూటీని అని అసలు లెక్క చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

'ఆర్యన్‌ కాదు కదా, అతడి డ్రైవర్‌ కూడా పట్టించుకోలేదు', 'చూశారా... ఆర్యన్‌ ఎంత యాటిట్యూడ్‌ చూపిస్తున్నాడో', 'పాపం, అనన్యను చూస్తే జాలేస్తోంది. ఎంత పెద్ద స్టార్‌ హీరో కొడుకైతే మాత్రం అంతలా యాటిట్యూడ్‌ చూపించాలా?', 'షారుక్‌ ఖాన్‌ దగ్గర నుంచి కొంచెమైనా నేర్చుకో' అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'బహుశా ఆర్యన్‌ ఏదో బాధలో ఉన్నాడేమోలే' అని మరికొందరు వెనకేసుకొస్తున్నారు.

చదవండి: ఓటీటీని షేక్‌ చేస్తున్న కార్తికేయ 2
ఆ హీరోతో కలిసి పని చేస్తే అంతే సంగతులు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top