స్కూటీపై వెళ్తుండగా యాక్సిడెంట్‌.. ఐసీయూలో హీరోయిన్‌.. | Arundhati Nair Severely Injured In Road Accident, Friend Seeks Help | Sakshi
Sakshi News home page

చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న హీరోయిన్‌.. సాయం చేయండంటూ..

Mar 18 2024 10:49 AM | Updated on Mar 18 2024 12:16 PM

Arundhati Nair Severely Injured In Road Accident, Friend Seeks Help - Sakshi

అరుంధతి వెంటిలేటర్‌పై పోరాడుతోంది. ఆస్పత్రి ఖర్చులకు కూడా వారి కుటుంబం దగ్గర డబ్బుల్లేవు. మా వంతు మేము సాయం చేశాం. కానీ అది సరిపోవడం లేదు. అం

హీరోయిన్‌ అరుంధతి నాయర్‌ రోడ్డు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను తిరువనంతపురంలోని ఆస్పత్రిలో చేర్పించగా ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అరుంధతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది.

వెంటిలేటర్‌పై హీరోయిన్‌
ఈ విషయాన్ని నటి గోపిక అనిల్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించింది. 'అరుంధతి వెంటిలేటర్‌పై పోరాడుతోంది. ఆమె కుటుంబానికి ఆస్పత్రి ఖర్చులు భరించే స్థోమత లేదు. మా వంతు మేము సాయం చేశాం. కానీ అది సరిపోవడం లేదు. మీరు కూడా తోచినంత సాయం చేస్తే అది ఆమె మెరుగైన చికిత్సకు ఉపయోగపడుతుంది' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ మేరకు బ్యాంకు వివరాలను సైతం పొందు పరిచింది.

కెరీర్‌..
కాగా 'పొంగి ఎలు మనోహర(2014)' సినిమాతో నటిగా వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టిందీ అరుంధతి. విరుమాండికుమ్‌ శివానందికమ్‌, సైతాన్‌, పిస్తా, ఆయిరం పోర్కాసుకల్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఒట్టకోరు కాముకన్‌ చిత్రంతో మలయాళ చిత్రసీమకు పరిచయమైంది. పద్మిని, డోంట్‌ థింక్‌ అనే వెబ్‌ సిరీస్‌ల్లోనూ యాక్ట్‌ చేసింది.

చదవండి: ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఏవి ఎందులో అంటే?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement