Anchor Anasuya Bharadwaj: I Have A Glass Of Wine Regularly - Sakshi
Sakshi News home page

తాగుతా, పొట్టను చూసి గర్వంగా ఫీల్‌ అవుతున్నా: అనసూయ

Apr 4 2021 5:33 PM | Updated on Apr 5 2021 9:07 AM

Anasuya Bharadwaj: I Have A Glass Of Wine Regularly - Sakshi

నేనేదైనా ఫొటో పెడితే చాలు.. ఇదంతా నీకవసరమా ఆంటీ, పిల్లలను చూసుకో అని చెప్తుంటారు. అదేదో వాళ్లే నా పిల్లకు ఫుడ్‌ పెడుతూ, ఫీజు కడుతున్నట్లు..

ఎవరేమన్నా డోంట్‌ కేర్‌ అంటూ తనకు నచ్చిన దారిలో నడుస్తుంది యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌. అటు బుల్లితెర మీద యాంకర్‌గా సత్తా చాటుతూనే సెలక్టివ్‌ పాత్రలను ఎంచుకుంటూ వెండితెర మీద కూడా రాణిస్తోంది. ఈ మధ్య స్పెషల్‌ సాంగ్స్‌లో ఆడిపాడుతున్న ఈ యాంకర్ గతంలో పవర్‌ స్టార్‌‌ పవన్‌ కల్యాణ్‌ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌ మాత్రం చేయనని తిరస్కరించిందట. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 'అత్తారింటికి దారేదీ' సినిమాలో 'ఇట్స్‌ టైమ్‌ టు పార్టీ నౌ..' పాట కోసం దర్శకనిర్మాతలు అనసూయను సంప్రదించారట. అయితే తను అందులో కనిపించాలంటే మిగతా ఎవరూ ఉండకూడదని, తను ఒక్కదాన్ని అయితే మాత్రమే చేస్తానని కండీషన్‌ పెట్టింది. అది కుదరకపోవడంతో అనసూయ సాంగ్‌ నుంచి తప్పుకుంది.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. "కెమెరా ముందు అందంగా ఉండాల్సిందే. లేదంటే ఆంటీ అంటూ హేళన చేస్తారు. బాడీ షేమింగ్‌ చేస్తుంటారు. కానీ నా శరీరాన్ని, ముఖ్యంగా పొట్టను చూసి నేను గర్వంగా ఫీల్‌ అవుతున్నా. ఎందుకంటే పొట్ట అంత పెద్దగా ఉంది కాబట్టే నా కొడుకు అందులో కంఫర్టబుల్‌గా ఉండగలిగాడు. ఇక ఇప్పుడు కూడా నేనేదైనా ఫొటో పెడితే చాలు.. ఇదంతా నీకవసరమా ఆంటీ, పిల్లలను చూసుకో అని చెప్తుంటారు. అదేదో వాళ్లే నా పిల్లకు ఫుడ్‌ పెడుతూ, ఫీజు కడుతున్నట్లు మాట్లాడుతుంటారు.

ఒకప్పుడు ఆ పిల్లకు పెళ్లైంది, పనికిరాదు అనేట్లుగా మాట్లాడేవారు. కానీ నేను బల్లగుద్ది చెప్పగలను. వాళ్లకంటే కంటే నేను బాగా నటిస్తాను అని. ఇక 'ఇట్స్‌ టైం టు పార్టీ..' సాంగ్‌కు అడిగారు. కానీ నేను ఒక్కదాన్నైతే మాత్రమే చేస్తానని చెప్పా. దీంతో నువ్వేంటి.. పవన్‌ కల్యాణ్‌ కాలి గోటికి కూడా సరిపోవు అని ట్రోల్‌ చేశారు. తర్వాత నన్ను అవమానించారని ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును కూడా వెనక్కు ఇచ్చేశాను" అని అనసూయ తెలిపింది. అలాగే తనకు తాగే అలవాటుందని, ఒక రోజైతే అర్ధరాత్రి 2 గంటలకు తాగేసి ఉన్నానని చెప్పుకొచ్చింది.

చదవండి: నాకెందుకు ప్రపోజ్‌ చేయలేదురా బాబు: అనసూయ

రామజోగయ్య శాస్త్రికి షాకిచ్చిన మెగాస్టార్‌!

Advertisement
 
Advertisement
Advertisement