Anand Deverakonda: 'హైవే'తో ఓటీటీలోకి ఆనంద్‌ దేవరకొండ ఎంట్రీ..

Anand Deverakonda Highway Will Direct Release In AHA - Sakshi

Anand Deverakonda Highway Will Direct Release In AHA: రౌడీ హీరోగా విజయ్‌ దేవరకొండ తనదైన ముద్ర వేసుకున్నాడు. అన్న బాటలోనే తను కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు విజయ్‌ సోదరుడు ఆనంద్ దేవరకొండ. 'దొరసాని' సినిమాతో తెలుగు వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆనంద్‌ 'మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం వచ్చిన 'పుష్పక విమానం' చిత్రంతో పర్వాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అయితే ఈసారి థియేటర్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా రానున్నాడు ఆనంద్‌ దేవరకొండ.

ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నిర్మించిన చిత్రం 'హైవే'. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం పోస్టర్‌ను శనివారం (ఆగస్టు 6) విడుదల చేసింది ఆహా. ఇందులో అభిషేక్‌ బెనర్జీ, మానస కీలక పాత్రలు పోషించారు. ఫొటోగ్రాఫర్‌ అయిన హీరో ప్రేమలో పడుతాడు. సాఫీగా సాగుతున్న అతని జీవితం.. ఓ సీరియల్‌ కిల్లర్ ఎంట్రీతో ఎలాంటి మలుపు తిరిగింది అనే కథతో ఈ సినిమా రూపొందినట్లు సమాచారం. తర్వలో ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించనున్నారు. మరి ఈ సినిమా ఆనంద్ దేవరకొండకు ఎలాంటి మలుపునిస్తుందో చూడాలి. 

చదవండి: మంటల్లో చిక్కుకున్న ప్రియాంక చోప్రా సహానటి..
బ్రేకప్‌ రూమర్స్‌..టైగర్‌ ష్రాఫ్‌ అదిరిపోయే స్టంట్స్‌! దిశా రియాక్షన్‌ ఇదే!
ఇక బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్టే.. రొమాంటిక్‌గా 'లైగర్‌' సాంగ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top