మెగాస్టార్ చిరంజీవికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషెస్ తెలిపారు. చిరు పుట్టినరోజు సందర్భంగా బన్నీ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. మన ఏకైక మెగాస్టార్ చిరుకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఆయనకు మనకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారని.. మనలో ప్రతి ఒక్కరినీ ఆయన స్ఫూర్తితో ముందుకు నడిపించారని కొనియాడారు. అంతేకాకుండా చిరు ఫోటోను కూడా చేశారు.
ఈ సందర్భంగా బన్నీ KKAVCF అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. దీని అర్థం ఏంటంటే.. తెలుగులో కట్టె కాలే అంత వరకు చిరంజీవి ఫ్యానే అంటూ మరోసారి తన అభిమానం చాటుకున్నారు. ఇది చూసిన బన్నీ అభిమానులు సైతం మెగాస్టార్‌కు విషెస్ చెబుతున్నారు.
కాగా.. చిరు బర్త్ డే సందర్భంగా బాబీతో చేస్తోన్న మూవీకి సంబంధించి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి కాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌తో మెగాస్టార్ అభిమానులు పండుగు చేసుకుంటున్నారు.
Many many happy returns of the day to our one and only Megastar @KChiruTweets garu . He is our greatest pillar of support . He inspired and uplifted each and every one of us. #KKAVCF (Iykyk) pic.twitter.com/QP1H2mX4v0
— Allu Arjun (@alluarjun) August 22, 2026


