ఫ్యాన్‌మేడ్‌ పోస్టర్‌పై అల్లు అర్జున్‌ ప్రశంసలు

Allu Arjun Shares A Terrific Fan Made Poster Of Pushpa - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ను ఐకాన్‌ స్టార్‌గా మార్చేసిన చిత్రం 'పుష్ప'. 'ఆర్య', 'ఆర్య 2' చిత్రాల తర్వాత సుకుమార్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే  పుష్పరాజ్‌ టీజర్‌ యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. టాలీవుడ్‌లోనే అత్యంత వేగంగా 60 మిలియన్ల వ్యూస్‌ అందుకున్న టీజర్‌గా రికార్డుకెక్కింది. ఇందులో ఊర మాస్‌ లుక్‌లో కనిపించిన బన్నీ 'తగ్గేదే లే..' అన్న డైలాగ్‌తో అభిమానులను ఊదరగొట్టాడు.

ఈ మధ్యే కరోనా బారిన పడిన బన్నీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తాజాగా అతడు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. విశేషమేంటంటే అతడు షేర్‌ చేసిన ఫొటో ఫ్యాన్స్‌ క్రియేట్‌ చేసినదే. ఆ పోస్టర్‌ బన్నీకి తెగ నచ్చిందట. దాంతో దాన్ని ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ఈ ఫ్యాన్‌మేడ్‌ పోస్టర్‌ చాలా అంటే చాలా నచ్చింది. థాంక్యూ అని రాసుకొచ్చాడు.

పుష్ప సినిమా విషయానికి వస్తే.. ఇందులో రష్మిక మందన్నా పల్లెటూరి పడుచు పిల్లగా కనిపించనుంది. మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌గా నటిస్తున్నాడు. అనసూయ, సునీల్‌ ముఖ్య పాత్రల్లో సందడి చేయనున్నారు. నవీన్‌ ఎర్నేని, వై. రవి శంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 13న  విడుదల చేయనున్నారు.

చదవండి: బన్నీకి కరోనా.. రెండు రోజులు ఆగితే అది పూర్తయ్యేది

అలా అనుకున్నాను కాబట్టే ఇంత దూరం వచ్చా!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top