సినిమా రంగంలోకి ఆదిత్య పాపగారి | Aditya Papagari Entry Into Film Industry From Realtor, Deets Inside - Sakshi
Sakshi News home page

సినిమా రంగంలోకి ఆదిత్య పాపగారి

Mar 31 2024 12:57 PM | Updated on Mar 31 2024 2:27 PM

Aditya Papagari Entry Into Film Industry - Sakshi

తెలుగు సినీ పరిశ్రమ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కంటెంట్‌నే నమ్ముకొని వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కిస్తూ హిట్‌ కొడుతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది వ్యాపార వేత్తల కన్ను టాలీవుడ్‌పై పడింది. ఇతర రంగాలలో రాణిస్తున్నవారు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. డిఫరెంట్‌ స్టోరీలతో తక్కువ బడ్జెట్‌లో సినిమాను నిర్మించి విజయం సాధిస్తున్నారు.

తాజాగాప్రముఖ రియల్టర్ ఆదిత్య పాపగారి కూడా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమా పరిశ్రమలో రాణించాలని, మంచి సినిమాలు అందించాలనే ఉద్దేశంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు.  షేక్ స్పియర్ డ్రీమ్స్ ఎల్ఎల్ పీ బ్యానర్ తో, ప్రముఖ దర్శకుడు, నిర్మాత స్వప్నేష్ చింతల తో కలిసి సంయుక్తంగా చిత్రాలు నిర్మించబోతున్నారు. మంచి సినిమాలతో పాటు కొత్తవాళ్లను, ఔత్సాహిక నటీనటులను, రచయితలను, దర్శకులను ప్రొత్సహించాలనేది తన మోటో అని ఆదిత్య పాపగారి అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement