shalu chaurasia: Attack on actress in KBR‌ Park, Speed Up Investigation - Sakshi
Sakshi News home page

Shalu Chaurasia: కేబీఆర్‌ పార్కులో నటిపై దాడి..దర్యాప్తు ముమ్మరం

Nov 16 2021 10:32 AM | Updated on Nov 16 2021 11:51 AM

Actress Shalu Chaurasia Attack:Investigation Speed Up - Sakshi

Actress Shalu Chaurasia Attack: బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కులో నటి చౌరసియాపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నాలగు పోలీసు బృందాలతో దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కేబీఆర్‌ పార్క్‌ చుట్టుపక్కలా సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. వీఐపీ జోన్‌లోనే దారి దోపిడీ జరగడంపై నగర సీపీ అంజనీ కుమార్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది.

కాగా ఆదివారం సాయంత్రం వాకింగ్‌కు వెళ్లిన నటి చౌరాసియాపై గుర్తుతెలియని వ్యక్తి దాడిచేసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం 92లోని స్టార్‌బక్స్‌ ఎదురుగా నిర్మానుష్య ప్రాంతం వద్ద దాడి చేసి ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కుని పరారయ్యాడు. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ఆభరణాలు, సెల్‌ఫోన్‌ కోసమే దాడికి పాల్పడ్డాడా..లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement