సమంత డిజైనర్ చీర.. ధర ఎంతో తెలుసా? | Actress Samantha Latest Black Saree Cost Details Viral on Social Media - Sakshi
Sakshi News home page

Samantha Saree: సింపుల్‌గా కనిపిస్తున్న ఈ చీర.. అంత ఖరీదా?

Aug 24 2023 3:51 PM | Updated on Aug 24 2023 4:02 PM

Actress Samantha Black Designer Saree Cost Details - Sakshi

హీరోయిన్ సమంత ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉంది. ఈ బ్యూటీ.. మయోసైటిస్ వ్యాధి చికిత్స కోసమే అక్కడికి వెళ్లిందని రూమర్స్ వచ్చాయి. మరి ఇందులో నిజమెంత ఉందనేది పక్కనబెడితే ప్రస్తుతం అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ అయిపోయింది. అయితే మిగతా విషయాల గురించి పక్కనబెడితే సామ్ ధరించిన స్పెషల్ చీర ధర.. ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సమంత హిట్ కొట్టి చాలారోజులు అయిపోయింది. అప్పుడెప్పుడో 2019లో 'ఓ బేబీ' మూవీతో సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత నుంచి పలు సినిమాలు చేస్తున్నా ఏవీ వర్కౌట్ కావడం లేదు. దీంతో ఇప్పుడు ఈమె ఆశలన్నీ 'ఖుషి'పై పెట్టుకుంది. సెప్టెంబరు 1న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సమంత.. దీని ప్రమోషన్స్‌కి రాకపోవచ్చని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో 'మళ్లీ పెళ్లి'.. సీనియర్ నటి క్లారిటీ)

తాజాగా న్యూయార్క్ లో దిగిన ఫొటోల్ని సమంత.. తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇందులో బ్లాక్ కలర్ డిజైనర్ శారీ ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. దీన్ని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్పితా మెహతా రూపొందించినట్లు తెలుస్తోంది. దీని ధర ఏకంగా రూ.1,38,000 అని సమాచారం. ఈ కాస్ట్ చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు.

ఎందుకంటే సమంత వేసుకున్న ఆ బ్లాక్ శారీ.. చూడటానికి చాలా సింపుల్‌గా ఉంది. బోర్డర్ అంతా డిజైన్ ఉంది. అలాంటి ఈ చీర దాదాపు లక్షన్నర ఖరీదు కావడం నెటిజన్స్ రియాక్షన్‌కి కారణమైంది. 

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)

Advertisement
 
Advertisement
Advertisement