కడపలో ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా సందడి | Actress Faria Abdullah Visits Dargah YSR Kadapa District | Sakshi
Sakshi News home page

Faria Abdullah: కడపలో ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా సందడి

Jun 10 2022 11:03 AM | Updated on Jun 10 2022 11:11 AM

Actress Faria Abdullah Visits Dargah YSR Kadapa District - Sakshi

Actress Faria Abdullah Visits YSR Kadapa: కడప నగరంలో జాతిరత్నాలు హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా సందడి చేసింది. గురువారం ఇక్కడి అల్మాస్‌పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘వావ్‌ హీరో’ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హజరై షో రూంను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు.

చదవండి: అల్లు అర్జున్‌పై కేసు, తప్పుదోవ పట్టించారంటూ పోలీసులకు ఫిర్యాదు

డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా, మేయర్‌ సురేశ్‌ బాబు, ఎండీ నవీన్‌లో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసింది. అయితే షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన ఫరియా ఈ సందర్భంగా కడపలోని అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకుంది. దర్గా సంపద్రాయం ప్రకారం ఫరియాకు దర్గా ముజావార్లు ఘనంగా స్వాగతం పిలికారు. దర్గా మాజర్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఫరియా అనంతరం దర్గా విశిష్టతను అడిగి తెలుసుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement