ప్రియుడితో 'చిన్నారి పెళ్లికూతురి' ఎంగేజ్‌మెంట్‌ | Actress Avika Gor Gets Engaged To Boyfriend Milind Chandwani See photos | Sakshi
Sakshi News home page

ప్రేమలో ఉన్న మ్యాజిక్కే వేరు.. 5 ఏళ్ల ప్రేమ.. టాలీవుడ్‌ బ్యూటీ నిశ్చితార్థం

Jun 11 2025 5:32 PM | Updated on Jun 11 2025 5:49 PM

Actress Avika Gor Gets Engaged To Boyfriend Milind Chandwani See photos

చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో సెన్సేషన్‌ సృష్టించిన అవికా గోర్‌ (Avika Gor) పెళ్లికి రెడీ అయింది. ప్రియుడు మిలింద్‌ చంద్వానీతో ఏడడుగులు వేసేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే వీరి నిశ్చితార్థం జరిగింది. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

సంతోషంతో అరిచేశా..
ఈ సందర్భంగా అవికా.. 'ఆయన నోరు తెరిచి అడగ్గానే.. సంతోషంతో ఏడ్చేశాను. ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నట్లుగా అవును అంటూ గట్టిగా అరిచాను. పూర్తిగా సినిమాల్లో మునిగినందున.. నాకు మైండ్‌లో మంచి బీజీఎమ్‌ వినిపిస్తోంది. స్లో మోషన్‌లో మా కల నెరవేరినట్లు కనిపిస్తోంది. అతడేమో ప్రశాంతగా ఉన్నాడు, తెలివిగా కనిపిస్తున్నాడు. అయినా మేమిద్దరం జంటగా ఫిట్టయ్యాం.

కన్నీళ్లు..
ఎప్పుడైతే అతడు నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడో అప్పుడు నాలో ఉన్న హీరోయిన్‌ నన్ను పూర్తిగా ఆవహించింది. గాల్లో తేలియాడిపోయా.. కళ్లనిండా నీళ్లు.. మెదడు ఆలోచించడమే మానేసినట్లు.. ఇలా రకరకాలుగా అనిపించింది. నిజమైన ప్రేమంటే ఇదే కదా! ప్రేమలో అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. కానీ అందులో ఉన్న మ్యాజిక్కే వేరు అని అవికా రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు.. అవికాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కెరీర్‌
ముంబైలో పుట్టిన అవికా గోర్‌.. పదేళ్ల వయసులోనే నటనా రంగంలోకి అడుగుపెట్టింది. ‘బాలికా వధు’ సీరియల్‌తో ఆమె జీవితమే మారిపోయింది. ఇదే తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురి’గా ప్రసారమైంది. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, 'బ్రో', 'షణ్ముఖ' ఇలా అనేక సినిమాల్లో నటించింది.

 

 

చదవండి: మంగ్లీ బర్త్‌డే పార్టీ.. తప్పు నామీదకు తోస్తారేంటి?: దివి

Advertisement
 
Advertisement
Advertisement