గ్రాండ్‌గా టాలీవుడ్ కమెడియన్ పెళ్లి.. ఫోటోలు వైరల్! | jabardasth Comedian marriage Photos Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

jabardasth Comedian marriage: జబర్దస్త్ కమెడియన్ పెళ్లి.. సందడి చేసిన టీం!

Apr 1 2024 3:47 PM | Updated on Apr 1 2024 3:47 PM

jabardasth Comedian marriage Photos Goes Viral In Social Media

టాలీవుడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతోమంది ఫేమస్ ‍‍అయ్యారు. ముఖ్యంగా లేడీ గెటప్స్‌లో ఆడియన్స్‌ను అలరిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో వినోద్, కొమరం, శాంతి స్వరూప్, మోహన్, తన్మయ్, సాయితేజ, పవన్, అప్పారావు చాలామందే ఉన్నారు. ప్రస్తుతం ఈ కామెడీ షో లేడీ గెటప్స్‌లో అలరిస్తున్న మోహన్‌ ఓ ఇంటివాడయ్యారు.

తాజాగా మోహన్‌ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకలో జబర్దస్త్ నటులు రాకెట్ రాఘవ, అధిరే అభి, గడ్డం నవీన్‌, అప్పారావు సహా పలువురు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను జబర్దస్‌ కమెడియన్‌ నవీన్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం మోహన్‌ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement