Sakshi News home page

పెద్దపల్లి ఎన్నికల ఇంచార్జిగా ప్రభాకర్‌

Published Tue, Apr 16 2024 12:00 AM

మాట్లాడుతున్న ప్రభాకర్‌  - Sakshi

బెల్లంపల్లి: పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల ఇంచార్జిగా బెల్లంపల్లికి చెందిన కాంగ్రెస్‌ ఓబీసీ సెల్‌ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ బండి ప్రభాకర్‌ నియామకం అయ్యారు. ఈ మేరకు ఓబీసీ సెల్‌ రాష్ట్ర చైర్మన్‌ నూతి శ్రీకాంత్‌గౌడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సోమవారం బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్‌ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభాకర్‌కు కాంగ్రెస్‌ శ్రేణులు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, డీసీసీ ఉపాధ్యక్షుడు మల్లేష్‌, మాజీ పట్టణ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్‌, పలు మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులు, నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement