సాదాసీదాగా ‘కొప్పుల’, వంశీ నామినేషన్‌ | Sakshi
Sakshi News home page

సాదాసీదాగా ‘కొప్పుల’, వంశీ నామినేషన్‌

Published Sat, Apr 20 2024 1:30 AM

కుటుంబ సభ్యులతో కలిసి వంశీ నామినేషన్‌  - Sakshi

సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి ఎంపీ స్థానానికి రెండోరోజు ముగ్గురు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పెద్దపల్లి కలెక్టరేట్‌లో రిట ర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. శుక్రవారం ఏకాదశి మంచిరోజు కావడంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కో రుకంటి చందర్‌తో కలిసి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యేలు విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్‌, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, నే తకాని సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గం నరేశ్‌తో కలి సి నామినేషన్‌ వేశారు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి మరో సెట్‌ అందజేశారు. వీరుకా కుండా బీఆర్‌ఎస్‌ తరఫున డమ్మీ అభ్యర్థిగా కొంకటి లింగమూర్తి ఒకసెట్‌ నామినేషన్‌ వేశారు. దీంతో ఇ ప్పటివరకు నామినేషన్లు వేసిన వారి సంఖ్య ఏడుకు చేరింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామినేషన్‌ కోసం ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌ రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో రాలేకపోయారు. దీంతో సాదాసీదాగానే నామినేషన్‌ వేశారు. మరోసారి అగ్రనేతల సమక్షంలో భారీ ర్యాలీలతో మరోసెట్‌ నామినేషన్‌కు సిద్ధమవుతున్నారు. కొందరు అభ్యర్థులను ‘సాక్షి’ పలుకరించగా..

ప్రాజెక్టులు తీసుకొస్తా

మా తాత అడుగుజాడల్లో ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చా. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలే దు. నేను, మా నాన్న సక్సెస్‌ఫుల్‌ వ్యాపారులం. ఆ అనుభవంతో కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.

– గడ్డం వంశీకృష్ణ, కాంగ్రెస్‌ అభ్యర్థి

ఇక్కడే పుట్టిన

ఇక్కడే పుట్టి, పెరిగిన. గెలిచినా ఓడినా ప్రజల మధ్యే ఉంటా. ఇక్కడే చస్తా. సింగరేణిలో 26ఏళ్లు కార్మికుడిగా పనిచేసిన. ఎక్కడి నుంచో వచ్చేవారిని కాకుండా ఉద్యమాల నుంచి వచ్చిన నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా. మాయమాటల కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెప్పాలి.

– కొప్పుల ఈశ్వర్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి

అగ్రనేతల ఆధ్వర్యంలో మరో సెట్‌

వేయనున్న అభ్యర్థులు

ఇప్పటివరకు ఏడుగురు అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు

నామినేషన్‌ దాఖలు చేస్తున్న కొప్పుల ఈశ్వర్‌
1/1

నామినేషన్‌ దాఖలు చేస్తున్న కొప్పుల ఈశ్వర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement