అవాంఛనీయ ఘటనలకు తావివ్వొద్దు | Sakshi
Sakshi News home page

అవాంఛనీయ ఘటనలకు తావివ్వొద్దు

Published Mon, Nov 27 2023 11:48 PM

మాట్లాడుతున్న  ఎన్నికల పరిశీలకులు - Sakshi

● పోలింగ్‌కు అంతాసిద్ధం చేయాలి ● ఎన్నికల పరిశీలకుడు అజయ్‌వినాయక్‌

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో మూడు నియోజవకర్గాల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా, పకడ్బందీగా నిర్వహించాని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు అజయ్‌వినాయక్‌, ప్రత్యేక పోలీస్‌ పరిశీలకులు దీపక్‌మిశ్రా అన్నారు. సమీకృత కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన స మావేశంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్‌దత్తా, సజ్జనార్‌, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బి.సంతోష్‌, పోలీస్‌ పరిశీలకులు ఆర్‌.ఇలంగో, రా మగుండ సీపీ రెమా రాజేశ్వరి, డీసీపీ సుధీర్‌ రామ్‌నాథ్‌ కేకన్‌, బెల్లంపల్లి ఆర్వో, అదనపు కలెక్టర్‌ రా హుల్‌, మంచిర్యాల ఆర్వో రాములు, చెన్నూర్‌ ఆ ర్వో సిడా దత్తుతో కలిసి ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికా రి మాట్లాడుతూ ఈవీఎంల భద్రతకు చెన్నూర్‌ నియోజకవర్గ పరిఽధిలోని కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బెల్లంపల్లి బజార్‌ ఏరియాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేశామని వివరించారు. ఎన్నికల నిర్వహణకు 10 ఫ్లయింగ్‌ స్క్వా డ్‌లు, 10 స్టాటిక్‌ సర్వేలెన్స్‌, 4 వీడియో సర్వేలెన్స్‌, 3 వీడియో పరిశీలన, 4 సహాయ ఖర్చుల పరిశీలకులు, 3 కౌంటింగ్‌ బృందాలు, 1 ఎంసీఎంసీ, 1 కంట్రోల్‌ రూమ్‌, 1 జిల్లా ఖర్చుల పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. అదనపు సిబ్బందితో కలిసి 97 సెక్టార్‌ అధికారులను నియమించామని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement