వివాహిత అదృశ్యం | Sakshi
Sakshi News home page

వివాహిత అదృశ్యం

Published Mon, Jan 15 2024 12:44 AM

పట్టుబడిన రేషన్‌ బియ్యం 
 - Sakshi

నాగర్‌కర్నూల్‌ క్రైం: వివాహిత అదృశ్యమైనట్లు పట్టణ ఎస్‌ఐ మహేందర్‌ ఆదివారం తెలిపారు. మున్సిపాలిటీలోని ఎండబెట్లకు చెందిన వెంకటమ్మకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఈనెల 4 ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు వెతికినా ప్రయెజనం లేకుండా పోయింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

నిందితులకు రిమాండ్‌

ఊర్కొండ: మండలంలోని ముచ్చర్లపల్లిలో డిసెంబర్‌ 28న పందుల చోరీపై వచ్చిన ఫిర్యా దు మేరకు దర్యాప్తు చేసిన అనంతరం ముగ్గు రిని రిమాండ్‌ తరలించినట్లు ఎస్‌ఐ లెనిన్‌ తెలిపారు. హైదరాబాద్కు చెందిన మక్కల నాగే ష్‌, మక్కల రాజు, మక్కల రజినీకాంత్‌, రాజే ష్‌పై కేసు నమోదు చేయగా, రాజేష్‌ పరారిలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పా రు. నిందితులు ముగ్గురి నుంచి 28 పందులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

రేషన్‌ బియ్యం

పట్టివేత

నారాయణపేట రూరల్‌: టాస్క్‌ఫోర్సు దాడుల్లో రేషన్‌ బియ్యం పట్టుబడింది. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సుభాష్‌రోడ్డులో అప్పిరెడ్డిపల్లికి చెందిన హన్మంతు ఇంట్లో నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యంపై టాస్క్‌ఫోర్సు పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. 20బస్తాల్లో 10 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం దొరికింది. డీటీ పంచనామా చేయగా యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement