పారదర్శకంగా హోం ఓటింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా హోం ఓటింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌

Published Wed, Nov 22 2023 1:38 AM

-

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: హోం ఓటింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ వివరాలు పారదర్శకంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌ నుంచి కలె క్టర్లు, రిటర్నింగ్‌ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వీటిని సహజ సిద్ధంగా, అందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నారు. ఎన్నికలకు కొన్ని రోజులు మాత్రమే ఉన్నందున ప్రతిరోజు కీలకమేనని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, వెబ్‌ కాస్టింగ్‌కు పూర్తి జాగ్రత్తతలు తీసుకోవాలని, కౌంటింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేయాలని, పంపిణీ కేంద్రాల్లో ఏర్పాట్లు, సీ విజిల్‌ ఫిర్యాదుల పరిష్కారం, సువిధ అనుమతులు, సీఈఓ కార్యాలయం నుంచి పంపించే ఎంసీసీ ఫిర్యాదుల పరిష్కారం, పోలింగ్‌ పార్టీల ఏర్పా టు, ఈవీఎంల కమిషనింగ్‌, బ్యాలెట్‌ పేపర్ల ముద్ర ణ తదితర అంశాలపై సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్‌ రవినాయక్‌ మాట్లాడుతూ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోం ఓటింగ్‌ వివరాలను తెలియజేశారు. సమావేశంలో రిటర్నింగ్‌ అధికారులు అనిల్‌కుమార్‌, మోహన్‌రావు, నటరాజ్‌, డీఆర్‌ఓ రవికుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement