2009లో పారిపోయి వస్తే.. | Sakshi
Sakshi News home page

2009లో పారిపోయి వస్తే..

Published Wed, Nov 22 2023 1:38 AM

-

తెలంగాణ రాష్ట్ర సాధనలో 2009 పార్లమెంట్‌ ఎన్నికల్లో కరీనంగర్‌ ప్రజలు ఓడగొడతారని పారిపోయి పాలమూరుకు వస్తే.. ఎంపీగా కేసీఆర్‌ను గెలిపించి.. తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఈ పాలమూరుకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రం సిద్ధించి పదేళ్లు గడిచినా మన కలలు నెరవేరలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వంశీకృష్ణ 50 వేల మెజార్టీతో గెలవబోతున్నారని, హెలీకాప్టర్‌లో నుంచి మిమ్మల్ని చూసినప్పడే నాకు సంపూర్ణ విశ్వాసం కలిగిందన్నారు.

ఊర్లమీద పడి ఊడ్చుకు తిన్నారు

బీఆర్‌ఎస్‌ నాయకులు మిడతల దండులా ఊళ్ల మీద పడి తెలంగాణ సంపదను ఊడ్చుకుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ తెచ్చామని చెప్పుకున్న బీఆర్‌ఎస్‌కు పదేళ్లు అవకాశం ఇస్తే.. ప్రతి పనిలో కమీషన్లు దండుకుని వంద ఎకరాల్లో ఫాంహౌస్‌లు, రూ.కోట్లు సంపాదించుకున్నారని, అలాంటి వారికి మరోసారి అవకాశం ఇవ్వొద్దని కోరారు. పదేళ్ల పాలనలో నష్టపోయింది చాలు అని.. ఇక మన పాలన మనమే చేసుకుందామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా మేఘారెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement