Sakshi News home page

ముగిసిన ఓటింగ్‌ యంత్రాల ఎఫ్‌ఎల్‌సీ ప్రక్రియ

Published Sat, Nov 11 2023 2:04 AM

-

కర్నూలు(సెంట్రల్‌): ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల పనితీరుకు సంబంధించి ఫస్టు లెవల్‌ చెకింగ్‌(ఎఫ్‌ఎల్‌సీ) ప్రక్రియ శుక్రవారంతో విజవయంతంగా ముగిసింది. 2024లో జరిగే సాధారణ ఎన్నికలకు వినియోగించే ఈవీఎంలు, వీవీప్యాట్లు, కంట్రోల్‌ యూనిట్ల పనితీరును మొదటి దశలో బెంగళూరుకు చెందిన బెల్‌ ఇంజినీర్లు నిశితంగా పరిశీలించారు. ఆయా పరికరాలను పోలింగ్‌ రోజున బూత్‌లలో వినియోగించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణ అంశాల పరిశీలన అక్టోబర్‌ 16న మొదలు కాగా ఈనెల 10వ తేదీతో పూర్తయింది. కర్నూలు జిల్లాకు కేటాయించిన 6650 వీవీప్యాట్లు, 5040 కంట్రోల్‌ యూనిట్లు, 6600 బ్యాలెట్‌ యూనిట్ల పనితీరును ప్రతి రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు బెల్‌ ఇంజినీర్లు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. ఇందుకోసం కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదాములో 16 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఎఫ్‌ఎల్‌సీ ప్రక్రియ నవంబర్‌ 8వ తేదీతో ముగియగా.. 9, 10 తేదీల్లో మాక్‌ పోల్‌ నిర్వహించారు. ఈ ప్రక్రియను కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన నిరంతరం పర్యవేక్షించారు. అక్టోబర్‌ 31న కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఎఫ్‌ఎల్‌సీ పరిశీలకుడు, ఈవీఎంల నోడల్‌ అధికారి లలిత్‌ మిట్టల్‌ తనిఖీ చేసి అభినందించారు. ఎఫ్‌ఎల్‌సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన బెల్‌ ఇంజినీర్లతో పాటు డీపీఓ నాగరాజునాయుడు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ మురళిని కలెక్టర్‌ అభినందించారు.

Advertisement

What’s your opinion

Advertisement