విశ్వసనీయతకు మారుపేరు వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

విశ్వసనీయతకు మారుపేరు వైఎస్‌ జగన్‌

Published Sun, May 12 2024 8:50 AM

విశ్వసనీయతకు  మారుపేరు వైఎస్‌ జగన్‌

వేమిరెడ్డిపల్లి(విస్సన్నపేట): విశ్వసనీయతకు మారుపేరు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్‌ సీపీ తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు అన్నారు. వేమిరెడ్డిపల్లి పంచాయతీలోని పలు గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. ప్రతి గ్రామంలో కార్యకర్తలు, మహిళలు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామిదాసు విలేకరులతో మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హమీలను నెరవేర్చి ప్రజల్లో విశ్వసనీయతను సంపాదించారన్నారు. స్థానికుడినైన తనను, కేశినేని శ్రీనివాస్‌ (నాని)ని ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, సర్పంచ్‌ పంతంగి విజయకుమారి, ఎంపీటీసీ వి. సత్యనారాయణచారి, సొసైటీ అధ్యక్షుడు రాయల వెంకట సత్యనారాయణ, స్థానిక నాయకులు నెక్కళపు సుబ్బారావు, నెక్కళపు శివయ్య, సూరా వెంకట్రామయ్య, రాష్ట్ర ఎస్టీ నాయకుడు భూక్యా రాము పాల్గొన్నారు.

టీడీపీ నుంచి

వైఎస్సార్‌ సీపీలో చేరికలు

జూపూడి(ఇబ్రహీంపట్నం): ఇటీవలి కాలంలో వైఎస్సార్‌ సీపీ నుంచి టీడీపీలో చేరిన తురకా దుర్గారావు తన బంధువులు వారం తిరగకముందే ఆ పార్టీని వీడి సొంతగూడికి వచ్చేశారు. మైలవరం నియోజవకర్గ పార్టీ పరిశీలకులు కర్ర హర్షవర్థన్‌రెడ్డి వారికి కండువాలు కప్పి వైఎస్సార్‌ సీపీలోకి ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేడపాటి నాగిరెడ్డి, మండల కన్వీనర్‌ బొంత సాంబశివరావు, దుర్గగుడి కమిటీ సభ్యుడు చింకా శ్రీనివాసరావు, కలతోటి కొండలరావు, బాణావత్‌ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement