No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, May 4 2024 9:05 AM

-

న్యూస్‌రీల్‌

అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: అందివచ్చిన అవకాశాల ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గెజిటెడ్‌ జూనియర్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌(జీజేఎల్‌ఏ) రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని చైతన్య కళాశాలలో శుక్రవారం జీజేఎల్‌ఏ, ఇంపాక్ట్‌ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్‌ పూర్తయిన విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఎంఎస్‌ఎన్‌ లాబొరేటరీస్‌ సంస్థలో ఉద్యోగాల కల్పనతోపాటు డిగ్రీ ప్రవేశాలపై జీజేఎల్‌ఏ జిల్లా అధ్యక్షుడు నవీన్‌రెడ్డి అధ్యక్షతన అవగాహన కల్పించారు. 80 మందికి ఇంటర్వ్యూ లు నిర్వహించగా.. 14 మంది ఉద్యోగాలకు ఎంపికై నట్లు ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ఉషారా ణి, ఇంపాక్ట్‌ సంస్థ ప్రతినిధులు వెంకటేశ్వర్లు, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement