బ్యాలెట్‌ యూనిట్ల కమీషనింగ్‌ పూర్తి | Sakshi
Sakshi News home page

బ్యాలెట్‌ యూనిట్ల కమీషనింగ్‌ పూర్తి

Published Wed, Nov 22 2023 12:26 AM

- - Sakshi

● పార్టీ నాయకుల సమక్షాన చేపట్టాం ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాకు ఇటీవల ఎన్నికల సంఘం పంపించిన అదనపు బ్యాలెట్‌ యూనిట్ల కమీషనింగ్‌ పూర్తిచేసి నియోజకవర్గాలకు కేటాయించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వీ.పీ. గౌతమ్‌ వెల్లడించారు. ఖమ్మంలోని జెడ్పీ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షాన అదనపు బ్యాలెట్‌ యూనిట్ల ఫస్ట్‌ లెవల్‌ చెకప్‌ పూర్తి చేసి కమీషనింగ్‌ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో అదనపు బ్యాలెట్‌ యూనిట్ల ఆవశ్యకత ఏర్పడిందని తెలిపారు. దీంతో ర్యాండమైజేషన్‌ ద్వారా నియోజకవర్గాలకు కేటా యించామన్నారు. ఇక మధిర, వైరా నియోజకవర్గాలకు సంబంధించి రెండో విడత ర్యాండమైజేషన్‌ కూడా పూర్తయిందని తెలిపారు. ఎన్నికల విధులకు కేటాయించిన పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇస్తూ, అక్కడే పోస్టల్‌ బ్యాలెట్లు స్వీకరిస్తున్నామని వెల్లడించారు. అంతేకాక జిల్లాలో సోమవారం నుండి హోమ్‌ ఓటింగ్‌ కూడా మొదలైందని తెలిపారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌నాయక్‌, పాలేరు రిటర్నింగ్‌ అధికారి ఎం.రాజేశ్వరి, తహసీల్దార్లు సీహెచ్‌.స్వామి, రామకృష్ణ, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రతీఒక్కరు ఓటు వేయాలి

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతీఒక్కరు ఓటుహక్కు విని యోగించుకోవాలని కలెక్టర్‌ గౌతమ్‌ సూచించారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులు, వయోజనులు, ట్రాన్స్‌జెండర్లతో కలిసి సర్దార్‌ పటేల్‌ స్టేడియం నుండి డీపీఆర్‌సీ భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఓటు ప్రాముఖ్యత, ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవడంపై అవగాహన కల్పించారు. అనంతరం డీపీఆర్‌సీ భవనంలోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌లో వయోవృద్ధులు, దివ్యాంగులను వంద శాతం భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈమేరకు జిల్లాలో 965 మంది సీనియర్‌ సిటిజన్లు, 669 దివ్యాంగులు కలిపి 1,634 మంది దరఖాస్తు చేసుకోగా ఇళ్ల వద్దే ఓటు వేయిస్తున్నామని చెప్పారు. అలాగే, జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాల్లో ర్యాంపులు నిర్మించడమే కాక వీల్‌ చెయిర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. డీఆర్డీఓ విద్యాచందన, జిల్లా సంక్షేమ అధికారి సుమ పాల్గొన్నారు.

అన్ని ఏర్పాట్లు చేయండి

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ సూచించారు. హైదరాబాద్‌ నుండి మంగళవారం ఆయన వీసీ ద్వారా మాట్లాడుతూ ఇంటి వద్ద నుంచి ఓటు సేకరణ వివరాలను ప్రతిరోజూ వెల్లడించాలని, పట్టణ ప్రాంత పోలింగ్‌ కేంద్రాల్లో వంద శాతం, గ్రామీణ ప్రాంత కేంద్రాల్లో 60 శాతం వెబ్‌ క్యాస్టింగ్‌ చేయాలని తెలిపారు. ఈసందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్‌ గౌతమ్‌ మాట్లాడుతూ జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాల్లో, చేసిన ఏర్పాట్లు, ఉద్యోగుల శిక్షణ వివరాలను వెల్లడించారు. వివిధ శాఖల అధికారులు వీ.వీ.అప్పారావు, హరికిషన్‌, సోమశేఖరశర్మ, విజయకుమారి, విజ యనిర్మల, అరుణ, మదన్‌గోపాల్‌, సత్యనారా యణ, రంజిత్‌, అన్సారీ పాల్గొన్నారు.

హ్యాండ్‌బుక్‌ పూర్తిగా చదవాలి

పోలింగ్‌ అధికారులకు అందించిన హ్యాండ్‌ బుక్‌ పూర్తిగా చదివితే ఎన్నికల ప్రక్రియపై సంపూర్ణ అవగాహన ఏర్పడుతుందని కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు. ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్‌ అధికారులకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా

పోలింగ్‌ విధుల్లోని అధికారులు నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ వివరాలు పరిశీలించారు. ఖమ్మం రిటర్నింగ్‌ అధికారి, కేఎంసీ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి తదితరులు పాల్గొన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ వివరాలు పరిశీలిస్తున్న కలెక్టర్‌
1/1

పోస్టల్‌ బ్యాలెట్‌ వివరాలు పరిశీలిస్తున్న కలెక్టర్‌

Advertisement
Advertisement