అమ్మ వద్దు.. పింఛనే ముద్దు | Sakshi
Sakshi News home page

అమ్మ వద్దు.. పింఛనే ముద్దు

Published Wed, Nov 8 2023 11:38 PM

కొడుకు ఆదరణకు 
నోచుకోని అప్పయ్యమ్మ  - Sakshi

కరప: కన్నతల్లి యోగక్షేమాలు గాలికొదిలేసి ఆమెకు ప్రతి నెలా వచ్చే పింఛన్‌ను మాత్రం ఠంచనుగా తీసుకొని వాడుకుంటున్న ప్రబుద్ధుడి ఉదంతమిది. ఎక్కడి నుంచో కరప వచ్చిన ఓ వృద్ధురాలు తన కొడుకు తనను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడో వివరించింది. తన పేరు కారపురెడ్డి అప్పయ్యమ్మ అని, కాకినాడలోని బ్యాంక్‌పేట వీధి అని, కొడుకు పేరు రాంబాబు అని, రిక్షా తొక్కుతాడని, భర్తపేరు ఆదినారాయణ (లేటు) అని ఆమె చెబుతోంది. కన్నకొడుకే ప్రతినెలా తనకు వచ్చే పింఛన్‌ తీసుకుని, ఒకో నెలలో ఒకో గ్రామంలో వదిలి వెళ్లడం, ఒకటో తారీఖు ముందు రోజు వచ్చి తీసుకెళ్లడం పరిపాటిగా మారిందని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. రెండు రోజుల క్రితం కరపలోని దుర్గాదేవి గుడి వద్ద కనిపించిన ఆమెకు మాజీ సర్పంచ్‌ పోలిశెట్టి తాతీలు, ఆర్‌ఎంపీ వైద్యులు గునిపే శోభన్‌బాబు టిఫిన్‌ పెట్టి, కప్పుకోవడానికి దుప్పటి ఇచ్చి, మార్కెట్‌ షెడ్‌లో ఆశ్రయమిచ్చారు. బుధవారం పుష్కరాల రేవు వద్ద ఉన్న ఆమెను జనావళి వృద్ధాశ్రమంలో చేర్చారు. పోలీసులు, అధికారులు స్పందించి వృద్ధురాలు అప్పయ్యమ్మ కొడుకు రాంబాబును పట్టుకుని తగిన విధంగా బుద్ధి చెప్పాలని మాజీ సర్పంచ్‌ కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement