ప్రభుత్వం చేసే మంచిని చెప్పండి | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం చేసే మంచిని చెప్పండి

Published Wed, Nov 8 2023 11:38 PM

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కన్నబాబు - Sakshi

కాకినాడ రూరల్‌: ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మంచిని ప్రజలకు చెప్పేందుకు ‘ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు జగనే కావాలి’ కార్యక్రమానికి గురువారం నుంచి శ్రీకారం చుడుతున్నామని, విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పిలుపు ఇచ్చారు. రమణయ్యపేట వైద్యనగర్‌ క్యాంపు కార్యాలయంలో బుధవారం మండల జేసీఎస్‌ కన్వీనర్‌ గీసాల శ్రీనివాసరావు అధ్యక్షతన గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ సీఎం జగన్‌ హయాంలో అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల కింద రూ.2.50 లక్షల కోట్ల పైచిలుకు సొమ్మును నేరుగా అకౌంట్లలో వేశారన్నారు. కుల, మతాలు, పార్టీ చూడకుండా వేశారన్నారు. ఎందుకు జగన్‌ కావాలంటే.. పథకాలు ఆగకూడని, దౌర్జన్యాలు ఉండకూడని, అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకోకుండా ఉండేటందుకన్నారు. ఇంద్రపాలెంలో ప్రారంభమవుతున్న కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. పథకాల లబ్ధికి సంబంధించిన వివరాలను అధికారులు సచివాలయం వద్ద బోర్డులో డిస్‌ప్లే చేస్తారన్నారు. తరువాత మన పార్టీ నాయకులు ఏదో సెంటర్‌లో జెండా ఆవిష్కరణ, ఇంటింటికి వెళ్ళి బుక్‌లో జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా కనుక్కుంటామన్నారు. రాత్రి అక్కడ బస చేయవచ్చన్నారు. పార్టీ నాయకులు, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు. సర్పవరం జంక్షన్‌లో సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పొరుగ పచ్చగా ఉంటే చూడలేని పచ్చ బ్యాచ్‌ గురించి తక్కువ మాట్లాడటంతో పాటు మన పార్టీ, మన నాయకుల గురించి తక్కువగా మాట్లాడేవారికి ధైర్యంగా సమాధానం చెప్పాలని కోరారు. సమావేశంలో ఏపీకి జగనే ఎందుకు కావాలో కార్యక్రమ వివరాలను జేసీఎస్‌ మండల కన్వీనరు గీసాల శ్రీనివాసరావు వివరించారు. జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్‌ గీసాల శ్రీను, జేఎస్‌టీయూ ఈసీ మెంబరు, తిమ్మాపురం సర్పంచ్‌ బెజవాడ సత్యనారాయణ ప్రసంగించారు. నేమాం సర్పంచ్‌ రామదేవు చిన్నా, అనుసూరి ప్రభాకరావు, లింగం రవి, మేకా కృష్ణంరాజు, నాని, గగారిన్‌, ధర్మరాజు, రామిరెడ్డి, కొండలరావు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ

జిల్లా అధ్యక్షుడు కన్నబాబు

‘ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు

జగనే కావాలి’పై సమావేశం

గృహ సారథులు,

సచివాలయ కన్వీనర్లకు సూచనలు

Advertisement

తప్పక చదవండి

Advertisement