విద్యార్థులు లక్ష్యం ఎంచుకోవాలి | Sakshi
Sakshi News home page

విద్యార్థులు లక్ష్యం ఎంచుకోవాలి

Published Tue, Apr 23 2024 8:20 AM

- - Sakshi

మొగుళ్లపల్లి: విద్యార్థులు వేసవి సెలవులను మంచి అవకాశంగా భావించి లక్ష్యం నిర్ణయించుకుని ముందుకు సాగాలని జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు అసిస్టెంట్‌ సెక్రటరీ భద్రయ్య అన్నారు. సోమవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత స్థానాలను చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయపాల్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నాలుగోరోజు..

14మంది నామినేషన్‌

సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానానికి నాలుగో రోజు సోమవారం 14మంది అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు దాఖల చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌కు వారు తమ నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ధర్మ సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా మంద రమేశ్‌, స్వతంత్ర అభ్యర్థులుగా దుర్గం సమ్మయ్య, ఆర్నకొండ రాజు, గడ్డం మారుతి, రాముల కార్తీక్‌, జుమ్మిడి గోపాల్‌, అంబాల మహేందర్‌, జనగామ నరేశ్‌, ముల్కల్ల రాజేంద్రప్రసాద్‌, దాగం సుధారాణి, జాడి ప్రేమ్‌సాగర్‌, అక్కపాక తిరుపతి ఒక్కోసెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు గద్దల వినయ్‌కుమార్‌, బొట్ల చంద్రయ్య రెండేసి సెట్ల నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 25మంది అభ్యర్థులు మొత్తంగా 31 సెట్ల నామినేషన్‌ పత్రాలు అధికారులకు అందజేశారు. ఈనెల 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

జాబ్‌మేళాకు విశేష స్పందన

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాకేంద్రంలోని సంఘమిత్ర డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో సోమవారం నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన వచ్చినట్లు కళాశాల కరస్పాండెంట్‌ గుర్రపు రవీందర్‌ తెలిపారు. కళాశాల కరస్పాండెంట్‌ గుర్రపు రవీందర్‌, ప్రిన్సిపాల్‌ ఎలుగూరి హరికృష్ణ అధ్యక్షతన తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) ఆధ్వర్యంలో జెన్‌ ప్యాక్ట్‌ కంపెనీ, హెచ్‌ఆర్‌ శ్యామ్‌ సన్‌ మెగా జాబ్‌ మేళాలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. జాబ్‌మేళాకు 153మంది అభ్యర్థులు హాజరు కాగా జెన్‌ ఫ్యాక్ట్‌ కంపెనీ హెచ్‌ఆర్‌ 46మంది అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్‌ గుర్రపు రవీందర్‌ మాట్లాడుతూ జాబ్‌ మేళా ద్వారా వచ్చిన ఉద్యోగాలను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు మొగిలి, రాజశేఖర్‌, నరేష్‌, ప్రవీణ్‌, ఆనంద్‌, ఉదయలక్ష్మి, మమత, రాజు, రంజిత్‌ పాల్గొన్నారు.

పనుల పరిశీలన

రేగొండ: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకోసం చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పకడ్బందీగా చేపట్టాలని జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి అన్నారు. కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకొడేపాక ప్రభుత్వ పాఠశాలలో చేపట్టాల్సిన పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. పాఠశాలలో తాగునీరు, టాయిలెట్స్‌ వంటి మౌలిక వసతులను చేపట్టాలన్నారు. పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

మృతుడి కుటుంబానికి

ఎమ్మెల్సీ పరామర్శ

చిట్యాల: మండలకేంద్రానికి చెందిన చింతల మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మృతుడి కుటుంబసభ్యులను సోమవారం పరామర్శించారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా, మండల నాయకులు చింతల రమేష్‌, పువ్వాటి హరికృష్ణ, గురుకుంట్ల కిరణ్‌, కొడెల రాయమల్లు, ఉప్పుల కిరణ్‌, కొత్త శ్రీనివాస్‌, తణుకు మధు ఉన్నారు.

1/2

2/2

Advertisement
Advertisement