సమయపాలన పాటించాలి | Sakshi
Sakshi News home page

సమయపాలన పాటించాలి

Published Tue, Apr 23 2024 8:25 AM

పీహెచ్‌సీలో రికార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్‌  - Sakshi

నర్మెట: వైద్య సిబ్బంది సమయ పాలన పాటించా లని కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా సందర్శించిన ఆయన ఆరోగ్య కేంద్రం పరిసరా లు, మందుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. నిర్మాణంలోని అదనపు గదిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం వైద్యాధికారి డాక్టర్‌ రవళి స్టెల్లాతో పాటు సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ ఎం.మహిపాల్‌రెడ్డి, ఎంఆర్‌ఐ సాయిబాబ, ఎస్‌ఎన్‌లు సామ్రాజ్యం, శ్రీలత, ఫార్మసిస్టు అనిల్‌కుమార్‌, ఎల్‌టీ మల్లయ్య, సూపర్‌వైజర్లు పద్మావతి, శ్రీనివాస్‌, ఐలయ్య తదితరులు ఉన్నారు.

ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలి

తరిగొప్పుల: కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను ఎప్పటికప్పుడూ మిల్లులకు తరలించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. సోమవారం మండలంలో పర్యటించిన ఆయన తహసీల్‌ కార్యాలయంలో రికార్డులు పరిశీలించిన అనంతరం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. అలాగే అబ్దుల్‌నాగారంలోని ఐకేపీ కేంద్రాన్ని సందర్శించా రు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. తహసీల్దార్‌ కిష్టయ్య, ఎంపీడీఓ దేవేందర్‌రెడ్డి, ఆర్‌ఐ రవీందర్‌, ఎంపీఓ ఆగా మిస్బాఆలాం తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా

Advertisement

తప్పక చదవండి

Advertisement