నేడే ఓట్ల పండగ.. | Sakshi
Sakshi News home page

నేడే ఓట్ల పండగ..

Published Tue, May 14 2024 12:40 AM

నేడే

కోరుట్ల నియోజకవర్గంలో 262, ధర్మపురిలో 269 పోలింగ్‌ కేంద్రాలు

పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

కోరుట్ల/కోరుట్ల రూరల్‌: నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నిక కోసం కోరుట్ల నియోజకవర్గంలో పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం జరిగే ఎన్నిక కోసం కోరుట్ల పట్టణంలోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌, కేంద్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం నుంచే ఆయా పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది సామగ్రితో సహా పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్లారు.కోరుట్ల నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం, కోరుట్ల రూరల్‌, కోరుట్ల అర్బన్‌, మల్లాపూర్‌, మెట్‌పల్లి రూరల్‌, మెట్‌పల్లి అర్బన్‌ లలో 262 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. 262 పీఎస్‌లను 26 రూట్లుగా విభజించారు.ఒక్కో రూట్‌కు ఒక సెక్టోరల్‌ ఆఫీసర్‌,ఒక రూట్‌ ఆఫీసర్‌,ఒక మైక్రో అబ్జర్వర్‌ ను నియమించారు. 262 పోలింగ్‌ కేంద్రాల్లో పీఓ, ఏపీవో, నలుగురు సిబ్బందిని నియమించారు.1572 మంది పోలింగ్‌ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 25 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా, 15 లోకేషన్లను సమస్యాత్మకంగా గుర్తించారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ఒక పోలీస్‌ ను నియమించారు. 25 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలకు అదనంగా ఇద్దరు కానిస్టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. 312 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌, మెట్‌పల్లి డీఎస్పీ ఉమా మహేశ్వర రావు పరిశీలించారు.

ధర్మపురిలో 269 పోలింగ్‌ కేంద్రాలు

ధర్మపురి: నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో నేడు నిర్వహించనున్న పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ధర్మపురిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆదివారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి దివాకర ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలను అప్పగించారు. నియోజక వర్గంలోని ఏడు మండలాల్లో మొత్తం 2,30,786 మంది ఓటర్లుండగా వారిలో 114639 పురుషులు కాగా 116047 మంది సీ్త్రలు, 6 గురు థర్డ్‌ జెండర్లున్నారు.

నియోజకవర్గంలోని మొత్తం 269 పోలింగ్‌ కేంద్రాలలో 79 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. మొత్తం 1155 మంది పోలింగ్‌ సిబ్బందిని ఏర్పాటు చేశారు.

నేడే ఓట్ల పండగ..
1/1

నేడే ఓట్ల పండగ..

Advertisement
 
Advertisement
 
Advertisement