వైరల్‌: ట్రాఫిక్‌లో డేంజరస్ బైక్ స్టంట్.. యువకుడికి దిమ్మ తిరిగింది! | Viral Video Of Bike Stunt Goes Horribly Wrong | Sakshi
Sakshi News home page

Dangerous Bike Stunt: ఒక్కసారిగా ముందు చక్రాన్ని పైకిలేపి బైక్‌ స్టంట్స్‌.. కారు మిస్‌.. కానీ, బ్యాడ్‌ లక్‌..

Oct 30 2021 1:53 PM | Updated on Sep 26 2022 1:13 PM

Viral Video Of Bike Stunt Goes Horribly Wrong - Sakshi

అలా వెళ్తూ ఒక్కసారిగా బైక్‌ ముందు చక్రాన్నిస్టైల్‌గా పైకి లేపాడు. అలాగే బైక్‌ నడుపుతూ కొంచెం దూరం వెళ్లి గాల్లోకి లేపిన చక్రాన్ని కిందకు దింపాడు. అయితే అప్పుడే ఏమైందో ఏమో గానీ

బైక్ స్టంట్స్‌ చేయడం ఎంత ప్రమాదమో అందరికి తెలిసిందే. తమ బైక్‌ స్టంట్స్ వల్ల ఇతర వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. అయినా కూడా కొందరు పట్టించుకోకుండా రోడ్డుపై స్టంట్స్‌ చేస్తూ పాపులర్‌ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. హీరోలా ఫీల్‌ అవుతూ రకరకాల స్టంట్లు చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు.  తాజాగా అలాంటి ఓ బైకర్ చేసిన స్టంట్ తేడాకొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది.
చదవండి: వ్యక్తి చుట్టు కుప్పగా హాట్‌ చిప్స్‌.. ఫన్నీ వీడియో..

ఐపీఎస్‌ అధికారి రుపిన్‌ శర్మ తన ట్విటర్‌లో పోస్టు చేసిన ఈ వీడియోలో ట్రాఫిక్‌ ఎక్కువ ఉన్న రోడ్డుపై ఓ యువకుడు అందరిలాగే బైక్‌పై వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఒక్కసారిగా బైక్‌ ముందు చక్రాన్నిస్టైల్‌గా పైకి లేపాడు. అలాగే బైక్‌ నడుపుతూ కొంచెం దూరం వెళ్లి గాల్లోకి లేపిన చక్రాన్ని కిందకు దింపాడు. అయితే అప్పుడే ఏమైందో ఏమో గానీ ఒక్కసారిగా బైక్‌ బ్యాలెన్స్‌ తప్పింది.
చదవండి: తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఫొటోకు ఫోజులు.. మండిపడుతన్న నెటిజన్లు

బైక్‌ ఊగిపోతూ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టబోయి తప్పించుకున్నాడు. కానీ వెంటనే వెనకాల వస్తున్న ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టాడు. దాంతో బైకర్‌ గాల్లో ఎగిరి పడ్డాడు. అతను వెనక తగిలించుకున్న బ్యాగ్ గాల్లో ఎగురుతూ పడింది. మరి బైకర్‌ పరిస్థితి ఎలా ఉందో తెలియదు గానీ ఇక్కడితో వీడియో పూర్తయింది. ఇదంతా కారులో వెళ్తున్న ఓ  వ్యక్తి వీడియో తీశాడు.

Advertisement
 
Advertisement
Advertisement