Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌ | Sakshi
Sakshi News home page

Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Published Wed, Apr 13 2022 4:39 PM

Top 10 Telugu Latest Current News Evening Headlines Today 13th April 2022 - Sakshi

అక్బరుద్దీన్‌ నిర్దోషి
తొమ్మిదేళ్ల కిందట విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసుల్లో నాంపల్లి కోర్టు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీని నిర్దోషిగా తేల్చింది.

ఎట్టకేలకు ప్రధానికి ఆహ్వానం
ఉక్రెయిన్‌ పరిణామాలు, రష్యా పట్ల భారత్‌ అనుసరిస్తున్న వైఖరితో జీ-7 సదస్సుకు భారత్‌కు ఆహ్వానం అందకపోవచ్చనే సంకేతాలు అందాయి. అయితే అనూహ్యాంగా భారత ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది. 

భారం పడుతోంది.. తప్పట్లేదు
డీజిల్‌ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పడిందని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో డిజీల్‌ సెస్‌ కింద పెంచాల్సి వస్తోందని పేర్కొన్నారు.

విజయ్‌ బీస్ట్‌ మూవీ రివ్యూ
సంచలన దర్శకుడు నెల్సన్‌, కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ కాంబోలో వచ్చిన బీస్ట్‌ సినిమా భారీ అంచనాల నడుమ ఇవాళే విడుదలైంది. మరి ఆ అంచనాలు అందుకుందా?..

ఆర్‌ఆర్‌ఆర్‌.. ఆ విషయంపై జక్కన వివరణ
ట్రిపుల్‌ ఆర్‌లో ఎన్టీఆర్‌తో పోలిస్తే రామ్‌ చరణ్‌ డామినేషన్‌ ఎక్కువగా ఉందనే మాట వినిపించింది. ఈ విషయంపై దర్శకుడు రాజమౌళి ఎట్టకేలకు స్పందించాడు. 

రషీద్‌ ఖాన్‌ రేంజ్‌లో మేము లేము
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు, గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌ను ఉద్దేశించి ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ కోచ్‌ ముత్తయ్య మురళీథరన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

పుతిన్‌కు అతడి ఫొటో పంపిన జెలెన్‌స్కీ
ఉక్రెయిన్ మిలిట‌రీ దుస్తులు ధ‌రించి.. చేతుల‌కు బేడీలతో ఉన్న ఓ వ్యక్తి ఫొటోను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ.. పుతిన్‌కు చూపిస్తూ ఓ ఆఫర్‌ ఇచ్చారు. ఇంతకీ ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరంటే..

మార్పు కనబడాలి: సీఎం జగన్‌
విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. విద్యావ్యవస్థలో మార్పు కనబడాలని ఈ సందర్భంగా అధికారులు సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.

కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలే గుణపాఠం చెప్తారు
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. కల్వకుంట్ల కుటుంబం డ్రామాలు ఆపాలని.. లేకుంటే రైతులే వారి డ్రామాలకు తెరదింపుతారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం బంపరాఫర్‌!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం బంపరాఫర్‌ ప్రకటించింది.ఇల్లు నిర్మించుకోవాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ వడ్డీ రేటుతో హౌస్‌ బిల్డింగ్‌ అడ్వాన్స్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement