మరింత చిక్కుల్లో పాక్‌.. మరోసారి ఆ జాబితాలోకి | Pakistan Remains On Fatf Grey List | Sakshi
Sakshi News home page

మరింత చిక్కుల్లో పాక్‌.. మరో సారి ఆ జాబితాలోకి

Jun 25 2021 8:58 PM | Updated on Jun 25 2021 10:22 PM

Pakistan Remains On Fatf Grey List - Sakshi

పారిస్: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) మరోసారి పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో పెట్టింది. దీంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) సహా అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సహాయాన్ని, పెట్టుబడులను పొందడానికి పాకిస్తాన్‌కు అవకాశాలు ఉండవు. ఈ జాబితా నుంచి బయటపడటం కోసం ఆ దేశం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థలకు అందుతున్న నిధులపై ఎఫ్ఏటీఎఫ్ నిఘా పెడుతుంది. ఈ సంస్థ ప్రకటించే గ్రే లిస్ట్‌లో పాకిస్థాన్ మూడేళ్ళ నుంచి ఉంది. ఎఫ్ఏటీఎఫ్ చర్యల ప్రణాళికను అమలు చేయడం, అదే సమయంలో, ఉగ్రవాదులకు రక్షణ కల్పించడం పాకిస్తాన్‌కు ఇబ్బందికరంగా మారింది. ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు పారిస్‌లో జూన్ 21 నుంచి 25 వరకు జరిగాయి.

చదవండి: ‘గ్రీన్‌’కి అందని పాజిటివ్‌ సిగ్నల్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement