ఈఎంటీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

గుంటూరు మెడికల్‌: జిల్లాలో 108 వాహనాల్లో ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌(ఈఎంటీ)గా పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని 108 జిల్లా మేనేజర్‌ జి.నాగదీప్‌ తెలిపారు. బీఎస్సీ బయాలజీ, బీజడ్‌–3, బీఎస్సీ నర్సింగ్‌, బయోకెమిస్ట్రి, మైక్రోబయాలజీ, బీఫార్మశీ, డీఎంఎల్టీ ఐదు సంవత్సరాలు అనుభవం ఉన్నవారు ఉద్యోగానికి అర్హులని పేర్కొన్నారు. ప్రత్తిపాడు, తెనాలి, మంగళగిరి, వట్టిచెరుకూరు, తుళ్లూరు, ఫిరంగిపురం, కొల్లిపర ప్రాంతాల్లో ఉద్యోగాలకు ఎంపికై న వారు పనిచేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతలను నవంబరు 17లోపు గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయం రెండో ఫ్లోర్‌లోని 108 కార్యాలయంలో సంప్రదించాలన్నారు. పూర్తి వివరాలకు 9121892889 నంబరులో సంప్రదించాలని కోరారు.

పలు రైళ్లు పునరుద్ధరణ

లక్ష్మీపురం : సౌట్‌ సెంట్రల్‌ రైల్వే గుంటూరు డివిజన్‌ పరిధిలో పలు రైళ్లను పునరుద్ధరించడం జరిగిందని డివిజన్‌ సీనియర్‌ డీసీఎం దినేష్‌కుమార్‌ బుధవారం వెల్లడించారు. రైలు నంబరు 07783 విజయవాడ – గుంటూరు, 07788 గుంటూరు – విజయవాడ, 07779 గుంటూరు –మాచర్ల, 07780 మాచర్ల – గుంటూరు, 07780 మాచర్ల – నడికుడి, 07789 నడికుడి –మాచర్ల రైళ్లు ఈ నెల 16 నుంచి పునరుద్ధరించడం జరిగిందని తెలిపారు.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top