సీఎం పర్యటన హైలైట్స్‌ | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటన హైలైట్స్‌

Published Thu, Nov 16 2023 1:48 AM

జనా‘కర్షక నేత’కు జేజేలు : సీఎం జగన్‌కు జ్ఞాపికను బహూకరిస్తున్న పీఆర్కే, పీవీఆర్‌  - Sakshi

● సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 10.45 గంటలకు మాచర్ల సాగర్‌ రోడ్డులో హెలిప్యాడ్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్నారు.

● పీఆర్కే, పీవీఆర్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

● రోడ్డు మార్గాన 3.5 కిలోమీటర్ల దూరంలోని సభాస్థలికి బస్సులో సీఎం చేరుకున్నారు.

● దారిపొడవునా ప్రజలు, మహిళలు రోడ్డుకిరువైపులా బారులు తీరి జేజేలు పలికారు.

● సభా వేదికపై వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.

● దాదాపు గంటసేపు సీఎం జగన్‌ ప్రసంగించారు.

● దాదాపు లక్ష మంది తరలి వచ్చినట్టు అంచనా.

● 60 వేల మందితో సభా ప్రాంగణం కిక్కిరిసింది.

● వైఎస్సార్‌ విగ్రహం సెంటర్‌లో మహిళలు ఏక రూప దుస్తులు ధరించి జననేతకు హారతులు పట్టారు. గుమ్మడి కాయలతో దిష్టి తీశారు.

● సుగాలి మహిళల పాటల కోలాహలం, యువకుల బైక్‌ ర్యాలీలతో మాచర్ల హోరెత్తింది.

● బందోబస్తును ఎస్పీ రవిశంకర్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.

 
Advertisement
 
Advertisement