మ్యాగీ కటోరీ చాట్‌ ట్రై చేయండిలా! | Maggi Katori Chaat Recipe, Viral Video Trending On Social Media See Netizens Reactions Inside - Sakshi
Sakshi News home page

మ్యాగీ కటోరీ చాట్‌ ట్రై చేయండిలా!

Jan 2 2024 5:14 PM | Updated on Jan 2 2024 6:27 PM

Viral Video: Maggi Katori Chaat Recipe - Sakshi

రోజుకో రకం వెరైటీ రెసీపీలనే మనం చూస్తూనే ఉన్నాం. ఇది అత్యంత విభిన్నమైన రెసిపీ. మ్యాగీ న్యూడిల్స్‌తో ఇప్పటి వరకు రకరకాల వంటకాలు చూసుంటారు. ఈ రెసీపి చూస్తే చాట్‌ ఇలా కూడా చెయొచ్చా!అని అంటారు. అంత ఆకర్షణీయంగా చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట పెద్ద సెన్సేషన్‌ సృష్టిస్తోంది. 

ఇంతకీ ఆ రెసిపీ ఎలా చేశారంటే?.. న్యూడీల్స్‌ని ఉడబెట్టి ఓ గిన్నెల తీసుకున్నారు. దానీ టీ వడకట్టే చిక్కంలో కొద్దిగా న్యూడిల్స్‌ తీసుకుని దాన్ని ఆ చిక్కానికి సరిపడగా సర్ధి నేరుగా మరిగే నూనెల వేయించారు. అది ఒక్కసారిగా బౌల్‌ మాదిరిగా రాగానే ఈ చిక్కం తీసి కాస్త డీప్‌ ఫ్రై చేశారు. ఆ తర్వాత ఆ న్యూడిల్స్‌ బౌల్‌లో కొద్దిగా ఉల్లిపాయలు, టమోట ముక్కలు కాస్త, గ్రీన్‌ చట్నీ కలిపి గార్నీష్‌ చేశారు. చివరిగా పెరుగ వేసి గార్నిషీ చేశారు.

అంతే మ్యాగీ కటోరీ చాట్‌ రెడీ. అందుకు సంబంధించిన వీడియోని తన్విగోర్‌ నెట్టింట షేర్‌ చేయడంతో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోకి 62 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. 

(చదవండి: కాఫీ రుచి బెటర్‌గా ఉండేందుకు ట్రిక్‌ కనిపెట్టిన శాస్త్రవేత్తలు!)

Advertisement
 
Advertisement
Advertisement