తేలిగ్గా బరువు తగ్గించే దానిమ్మ! | Is pomegranate Juice Beneficial For Weight Loss? | Sakshi
Sakshi News home page

తేలిగ్గా బరువు తగ్గించే దానిమ్మ!

Nov 19 2024 9:29 AM | Updated on Nov 19 2024 10:04 AM

Is pomegranate Juice Beneficial For Weight Loss?

దానిమ్మ గుండెజబ్బులను నివారిస్తుందన్నది చాలామందికి తెలిసిందే. అయితే అది బరువు పెరగకుండా చూడటం వల్ల ఒబేసిటీ కారణంగా వచ్చే అనేక ఆరోగ్య అనర్థాలను కూడా నివారిస్తుంది. దానిమ్మతో బరువు తగ్గడానికి కారణమూ ఉంది. అదేమిటంటే... ఇందులో 7 గ్రాముల పీచు ఉండటం వల్ల అది కడుపు (స్టమక్‌) ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుతుంది. 

అంతేకాదు దానిమ్మపండులో 3 గ్రాముల ప్రోటీన్, విటమిన్‌ సీ, విటమిన్‌ కె అనే ప్రధాన విటమిన్లతోపాటు పొటాషియమ్‌ వంటి హైబీపీని నియంత్రించేందుకు సహాయపడే లవణాలూ ఉన్నాయి. తక్కువ చక్కెర, ఎక్కువ పీచు ఉన్నందున బరువు తగ్గించడానికి దానిమ్మపండు బాగా ఉపయోగపడుతుంది.

(చదవండి: 'ఎల్లప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలంటే'..!: ఇవాంక ట్రంప్‌ ఫిట్‌నెస్‌ మంత్ర..!)

Advertisement
 
Advertisement
Advertisement