బ్రేక్‌ఫాస్ట్‌లో సింపుల్‌గా అప్పం.. ఇలా చేసుకోండి | How To Make Appam Recipe In Telugu | Sakshi
Sakshi News home page

How To Make Appam Recipe: బ్రేక్‌ఫాస్ట్‌లో సింపుల్‌గా అప్పం.. ఇలా చేసుకోండి

Sep 7 2023 1:28 PM | Updated on Sep 7 2023 2:00 PM

How To Make Appam Recipe In Telugu - Sakshi

అప్పం తయారీకి కావలసినవి:
పొట్టు తీసిన పెసరపప్పు – కప్పు ; మినపపప్పు – అరకప్పు ; సోంపు – అరటీస్పూను; అల్లం – అంగుళం ముక్క ; క్యారట్, బీట్‌ రూట్, ప్రెంచ్‌ బీన్స్, బేబీ కార్న్, పచ్చి బఠాణి – అన్నీ కలిపి కప్పు; ఉప్పు – రుచికి సరిపడా ; నూనె – వేయించడానికి తగినంత. 

తయారీ విధానమిలా..
పప్పులను శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి .
నానిన పప్పుల్లో అల్లం, సోంపు కొద్దిగా నీళ్లు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు రుబ్బిన పిండిలో కూరగాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
గుంత పునుగుల ప్లేట్లకి కొద్దిగా నూనె రాసి పిండి మిశ్రమాన్ని అప్పల్లా వేయాలి కొద్దిగా నూనె వేసి రెండువైపులా చక్కగా కాల్చుకుంటే హెల్దీ అప్పం రెడీ.


 

Advertisement
 
Advertisement
Advertisement