జగన్‌ మళ్లీ సీఎం కావాలంటూ ఎమ్మెల్సీ పాదయాత్ర | Sakshi
Sakshi News home page

జగన్‌ మళ్లీ సీఎం కావాలంటూ ఎమ్మెల్సీ పాదయాత్ర

Published Sat, Nov 25 2023 12:26 AM

భీమడోలు జంక్షన్‌ వద్ద ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుకు స్వాగతం పలుకుతున్న పార్టీ శ్రేణులు  - Sakshi

భీమడోలు : సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ విజయనగరం జిల్లా ఎస్‌.కోట నుంచి పాదయాత్రగా బయలుదేరిన ఎమ్మెల్సీ ఇందుకూరి రాఘురాజు తన అనుచరులతో కలిసి శుక్రవారం భీమడోలు జంక్షన్‌కు చేరుకున్నారు. మండల వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులంతా ఆయనకు ఘన స్వాగతం పలికారు. జై జగన్‌, జై జై జగన్‌ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. రూపక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి పాదయాత్రగా పార్టీ శ్రేణులంతా ఆయనతో కలిసి సూరప్పగూడెం చేరుకున్నారు. ఎఎంసీ చైర్మన్‌ ఇంజేటి నీలిమ జూనియర్‌ ఇంటి వద్ద బస చేశారు. అనంతరం సూరప్పగూడెం నుంచి కొవ్వలి వరకు జెడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగ, ఏఎంసీ చైర్మన్‌ ఇంజేటి నీలిమ జూనియర్‌ తదితరులు ఆయనతో కలిసి పాదయాత్ర చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సీఎం కావాలని కోరుతూ విజయనగరంలోని ఎస్‌.కోట నుంచి తిరుపతికి 820 కిలోమీటర్ల దూరాన్ని 43 రోజుల్లో పూర్తి చేయాలన్న సంకల్పంతో పాదయాత్ర చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 17 రోజులు పాదయాత్ర పూర్తయ్యిందన్నారు. డిసెంబర్‌ 21న జగనన్న పుట్టిన రోజు నాటికి తిరుపతి చేరుకుంటామన్నారు. పార్టీ శ్రేణులంతా జగనన్న కోసం ఉప్పెనలా తరలి వస్తున్నారని, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 175 సీట్లు గెలవడం ఖాయమని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు జగన్‌మోహన్‌రెడ్డిపై మెండుగా ఉన్నాయని, రెండోసారి సీఎం కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగ, ఏఎంసీ చైర్మన్‌ ఇంజేటి నీలిమజూనియర్‌, మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ రావిపాటి సత్యశ్రీనివాస్‌, రాష్ట్ర కార్యదర్శి ముళ్లగిరి జాన్సన్‌, జిల్లా చైతన్య యువజన సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ పాము మాన్‌సింగ్‌, మండల ప్రధాన కార్యదర్శి రామకుర్తి నాగేశ్వరరావు, ఎంపీటీసీ గంటా శ్రీనివాసరావు, ఎం.నాగులపల్లి ఉపసర్పంచ్‌ కృష్ణంరాజు, మాజీ సర్పంచ్‌ చిలపర్తి రామారాయుడు, మాజీ ఉపసర్పంచ్‌ అంబటి నాగేంద్ర ప్రసాద్‌, నాయకులు చెరుకూరి మధు, గోవింద మాలధారులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ రఘురాజుకు స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు

Advertisement
Advertisement