Sakshi News home page

నేడు కంప్యూటర్‌ నైపుణ్య పరీక్ష

Published Mon, Nov 13 2023 11:40 PM

సమావేశంలో పాల్గొన్న డీఆర్‌ఓ నరసింహులు తదితరులు  - Sakshi

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పీఆర్‌, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్‌ – 5, గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్‌– ఐఐ, వీఆర్వో గ్రేడ్‌ –ఐ, రెవెన్యూ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్లు, కారుణ్య కారణాలపై నియమితులైన జిల్లాకు చెందిన ఉద్యోగులకు మంగళవారం కంప్యూటర్‌ నైపుణ్య పరీక్ష నిర్వహిస్తున్నట్టు జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు అన్నారు. పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్‌ డీఆర్‌ఓ చాంబర్‌లో సమన్వయ కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆర్డినేషన్‌ ఆఫీసర్‌, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు మాట్లాడుతూ కాతేరులోని జీఎస్‌ఆర్‌ ఆన్‌లైన్‌ అకాడమీలో పరీక్ష జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 వరకూ పరీక్షకు 110 మంది, అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటల వరకూ జరిగే పరీక్షలకు 115 మంది హాజరుకానునట్టు తెలిపారు. పరీక్షకు గంట ముందు అభ్యర్థులను అనుమతిస్తామని, ఎటువంటి ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ తీసుకురాకూడదన్నారు. హాల్‌ టికెట్‌తో పాటు ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నారు. పరీక్షల లైజన్‌ ఆఫీసర్‌గా డిప్యూటీ తహసీల్దార్‌ (సీఎస్‌)ఎం.నాగలక్ష్మిని నియమించామన్నారు.

Advertisement
Advertisement