తయారీపై శిక్షణ పొందాం | Sakshi
Sakshi News home page

తయారీపై శిక్షణ పొందాం

Published Wed, Nov 8 2023 11:38 PM

- - Sakshi

మా గ్రామం నుంచి చాలా మంది మహిళలు డొక్క పీచుతో బొమ్మల తయారీపై శిక్షణ పొందారు. కోనసీమలో సులభంగా లభ్యమయ్యే డొక్క పీచుతో ఎన్నో అద్భుతమైన బొమ్మలు తయారు చేయవచ్చు. వీటితో పాటు కొబ్బరి ఉప ఉత్పత్తుల తయారీకి కూడా ఆస్కారం ఉంది. క్వాయర్‌ బోర్డు సహకారం అందిస్తే దీనిని కుటీర పరిశ్రమగా మరింతగా విస్తరిస్తాం.

– వానరాశి సరస్వతి, మామిడికుదురు

జీవనోపాధి

కొబ్బరి పీచుతో బొమ్మలు తయారు చేయడం చాలా సులభం. బొమ్మల తయారీపై క్వాయర్‌ బోర్డు ఇచ్చిన శిక్షణలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పీచుతో ఎంతో అందంగా ఉండే బొమ్మలు రూపుదిద్దుకుంటున్నాయి. బొమ్మల తయారీని ప్రతి గ్రామానికీ విస్తరిస్తే మహిళలకు మరింత జీవనోపాధి కలుగుతుంది. ఈ దిశగా క్వాయర్‌ బోర్డు కార్యాచరణ చేపట్టాలి.

– కాకి వెంకటనాగలక్ష్మి, బి.దొడ్డవరం

మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలి

కొబ్బరి పీచుతో బొమ్మలు తయారు చేయడంలో ఎంతో మంది మహిళలు శిక్షణ పొందారు. కానీ మేం త యారు చేస్తున్న బొమ్మలకు మార్కెటింగ్‌ సదుపా యం పెద్ద సమస్యగా మారింది. క్వాయర్‌ బోర్డుతో పాటు ప్రభుత్వం కూడా మార్కెటింగ్‌ సదుపాయం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలి. దీనివల్ల మహిళలకు మేలు జరుగుతుంది. మరింత మంది బొమ్మల తయారీకి ముందుకు వస్తారు.

– పెద్దిరెడ్డి సురేఖ, అప్పనపల్లి

1/2

2/2

Advertisement
Advertisement