కూతురుతో సహా సినీ నటి అదృశ్యం | Movie Actress Disappeared Along With Daughter | Sakshi
Sakshi News home page

కూతురుతో సహా సినీ నటి అదృశ్యం

Sep 3 2020 8:40 PM | Updated on Sep 3 2020 8:47 PM

Movie Actress Disappeared Along With Daughter - Sakshi

సాక్షి, చెన్నై: కు​మార్తెతో సహా సినీ నటి అదృశ్యం కావడంతో ఆమె భర్త పోలీసుల్ని ఆశ్రయించాడు. ‘చిన్న పూవే మేల్ల’  చిత్రం ద్వారా నర్మద వెండితెరకు హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో నటుడు రాంకీ, ప్రభు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. 1987 విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. నర్మద కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే ఆ ఒక్క చిత్రంతోనే నర్మద  సినిమాలకు గుడ్‌బై చెప్పారు. అనంతరం స్థానిక తారాపురంకు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని గృహిణిగా స్థిరపడ్డారు. అయితే నర్మద తన 15 ఏళ్ల కూతురుతో సహా  కనిపించకపోవడంతో ఆమె భర్త బంధువులు పలుచోట్ల వారి కోసం గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో నర్మద భర్త గురువారం తారాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: హీరోయిన్‌తో బిగ్‌బాస్‌ విన్నర్ పెళ్లి‌!)

Advertisement
 
Advertisement
Advertisement