శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టివేత | Heroin Seized At Shamshabad Airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Jul 19 2021 6:28 PM | Updated on Jul 19 2021 8:55 PM

Heroin Seized At Shamshabad Airport - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌లో మరోసారి భారీగా హెరాయిన్ పట్టుబడింది. జాంబియా దేశానికి చెందిన ఓ మహిళ వద్ద దాదాపు 3.2 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. జాంబియా దేశం నుండి ఖతార్ ఎయిర్ లైన్స్ విమానంలో దోహా మీదుగా మహిళ ప్రయాణికురాలు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో డీఆర్ఐ ఆధికారులు ముందస్తు సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ హెరాయిన్ విలువ దాదాపు రూ. 21 కోట్లు ఉంటుందని డీఆర్ఐ ఆధికారులు అంచనా వేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement