Ganesh Attacked On His Girlfriend Vasavi With Knife In Narsingi, Details Inside - Sakshi
Sakshi News home page

HYD: ఐటీ ఉద్యోగిపై జొమాటో డెలివరీ బాయ్‌ దాడి.. ప్రేమే కారణం?

Jun 21 2023 10:37 AM | Updated on Jun 21 2023 1:02 PM

Ganesh Attacked His Girlfriend Vasavi In Narsingi - Sakshi

సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారమై యువకుడు దాడి చేశాడు. ఆమె మెడపై, చేతులపై కత్తితో దాడి చేయడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. దీంతో​, హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. 

వివరాల ప్రకారం.. వాసవిపై గణేశ్‌ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వాసవి మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఇంపార్టెంట్‌ విషయం మాట్లాడాలంటూ గణేశ్‌.. వాసవిని హోటల్‌ వద్దకు పిలిచాడు. ఈ సందర్భంగా ఆమె అక్కడికి వచ్చింది. వారిద్దరూ మాట్లాడుకున్న కాసేపటికే వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో, ఆవేశానికి లోనైన గణేశ్‌.. తన బ్యాగులో ఉన్న కత్తిలో ఒక్కసారిగి ఆమెపై దాడి చేశాడు. మెడ, చేతిపై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. 

అయితే, తనను ప్రేమించలేదన్న కోపంతోనే గణేశ్‌ దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక, వాసవి, గణేశ్‌.. ఇద్దరూ గుంటూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వాసవి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, గణేశ్‌ జొమాటోలో పనిచేస్తున్నాడు. ఇక, వీరిద్దరూ గచ్చిబౌలి ఏరియాలోని ప్రైవేటు హాస్టల్స్‌లో ఉంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: ప్రియురాలికి చీరను తీసుకెళ్లి శవమయ్యాడు!

Advertisement
 
Advertisement
Advertisement