Baby Girl Found Dead In Warangal - Sakshi
Sakshi News home page

లేడీస్‌ హాస్టల్‌ సమీపంలో ఆడ శిశువు మృతదేహం కలకలం..

Apr 13 2023 10:54 AM | Updated on Apr 13 2023 11:53 AM

Baby Girl Found Dead In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్‌లో ఆడ శిశువు మృతదేహం కలకలం సృష్టించింది. అప్పుడే పుట్టిన బిడ్డను రోడ్డుపై పడేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆడ శిశువుని పడేశారో, మరేదైనా కారణమో తెలియదు కానీ, రంగంపేటలోని డాక్టర్ గన్నుకృష్ణ మూర్తి హాస్పిటల్ పక్క వీధిలో పసి పాప మృతదేహం చూపరుల హృదయాలను ద్రవింపజేసింది. చుట్టు పక్కల హాస్పిటల్, లేడీస్ హాస్టల్ ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అక్రమ సంబంధంతో పుట్టిన బిడ్డని పడేశారో, పురిట్లోనే శిశువు మృతితో పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించి శిశు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. శిశువు పడేసిన విషయంపై ఆరా తీస్తున్నారు.
చదవండి: పెళ్లయ్యాక ఆమెతో భర్త ఒక్కరోజు గడపలేదు.. మరో మహిళతో రీల్స్‌..

Advertisement
 
Advertisement
Advertisement