ప్రచారం.. పరిసమాప్తం | Sakshi
Sakshi News home page

ప్రచారం.. పరిసమాప్తం

Published Sun, May 12 2024 11:20 AM

ప్రచా

మరింత బాధ్యతగా విధులు
పోలింగ్‌ సందర్భంగా మరింత బాధ్యతగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు.

అవగాహనతో విధుల నిర్వహణ

ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవగాహనతో ఎన్నికల విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్‌ ఆదేశించారు.

ఆదివారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2024

13న వేతనంతో కూడిన సెలవు

చిత్తూరు కలెక్టరేట్‌ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన పోలింగ్‌ రోజు ప్రభుత్వేతర సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఆయా సంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

చిత్తూరు కలెక్టరేట్‌/ చిత్తూరు అర్బన్‌:సార్వత్రిక ఎన్నిక ల ప్రచారానికి తెరపడింది. శనివారం సాయంత్రం 6 గంటలతో ప్రచార పర్వం పరిసమాప్తమైంది. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ రాత్రి 7 గంటల వరకు 144 సెక్షన్‌ అమలు చేయడం జరుగుతుందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. సోమవారం పోలింగ్‌ను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగానే చిత్తూరులో కేంద్ర సాయుధ బలగాలు కవాతు నిర్వహించాయి. ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు మూతబడ్డాయి. ఈనెల 13వ తేదీ రాత్రి 8గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసేయాల్సిందే అని ఎకై ్సజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ జిల్లా అధికారి షేక్‌ ఆయేషాబేగం స్పష్టం చేశారు. చిత్తూరు నగరంలో పెద్ద సంఖ్యలో స్థానికేతరులను టీడీపీ నేతలు రప్పించినట్లు సమాచారం. పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మందిని తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించేందుకు ప్రణాళిక రచించిటన్లు తెలిసింది. దీనిపై పోలీసులు దృష్టి సారించి స్థానికేతరులను జిల్లా వెలుపలకు పంపించాల్సిన అవసరముంది. అలాగే టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నేతలు విచ్చలవిడిగా మద్యం, నగదు పంపకాలు చేపట్టారు. కర్ణాటక నుంచి భారీగా మద్యం తీసుకువచ్చి ఇక్కడి ఓటర్లను మత్తులో ముంచుతున్నారు.

మూడో ర్యాండమైజేషన్‌ పూర్తి

జిల్లాలో మూడో ర్యాండమైజేషన్‌ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో అబ్జర్వర్‌లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొత్తం ప్రక్రియ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికల సంఘం నిర్ధేశించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి వెంట తెచ్చుకుని ఓటు వేయవచ్చని సూచించారు. కార్యక్రమంలో అబ్జర్వర్‌లు షాదిక్‌ అలం, శంకర్‌ప్రసాద్‌శర్మ, చిత్తూరు అసెంబ్లీ ఆర్‌ఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.

– 8లో

– 8లో

– 8లో

రేపే పోలింగ్‌

అమల్లోకి 144 సెక్షన్‌

ప్రచారం.. పరిసమాప్తం
1/1

ప్రచారం.. పరిసమాప్తం

Advertisement
 
Advertisement
 
Advertisement