న్యూఇయర్‌కు పకడ్బందీ ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

న్యూఇయర్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

Published Wed, Dec 20 2023 12:38 AM

గో సంరక్ష ట్రస్ట్‌కు, నిత్యాన్న దానానికి విరాళామిస్తున్న మనోజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు  - Sakshi

కాణిపాకం(యాదమరి): కాణిపాక వరసిధ్ది వినాయకస్వామి ఆలయంలో నూతన సంవత్సరం సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆలయ ఈఓ వెంకటేశు, అడిషనల్‌ ఎస్పీ సుధాకర్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. చైర్మన్‌ మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈఓ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి కాణిపాకానికి ప్రత్యేక బస్సులు నడపాలను ఆర్టీసీ అధికారులకు సూచించారు. సమావేశంలో ఈఈ వెంకటనారాయణ, ఏఈఓలు కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, విద్యాసాగర్‌రెడ్డి, హరిమాధవరెడ్డి, ధనంజయ, సూపరింటెండెంట్‌ కోదండపాణి, వాసు, సీఐ రవిశంకర్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాసరావు, ఎంపీడీఓ నాగరాజు పాల్గొన్నారు

వరసిద్ధునికి విరాళం

వినాయకస్వామి ఆలయంలోని గో సంరక్షణ ట్రస్ట్‌కు హైదరాబాద్‌ నిజాంపేట్‌కు చెందిన మనోజ్‌కుమార్‌, కుటుంబసభ్యులు రూ. 2.16 లక్షలు, నిత్యాన్నదానానికి రూ. 1.16 లక్షలు మొత్తం రూ.3.32 లక్షలను విరాళంగా అందజేశారు. దాతలకు అధికారులు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలోఏఈఓ విద్యాసాగర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement