నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | stock market updates on april 1 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Apr 1 2025 9:32 AM | Updated on Apr 1 2025 9:38 AM

stock market updates on april 1 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 67 పాయింట్లు నష్టపోయి 23,454కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 303 పాయింట్లు దిగజారి 77,113 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 104.1 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 74.97 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.19 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.55 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.14 శాతం దిగజారింది.

ఎఫ్‌పీఐలు, రిటైలర్ల పెట్టుబడుల దన్నుతో ఒక్క మార్చి నెలలోనే మార్కెట్లు భారీగా టర్న్‌అరౌండ్‌ అయ్యాయి. సెన్సెక్స్‌ 4,217 పాయింట్లు(5.8 శాతం) ఎగసింది. బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 3,555 పాయింట్లు(8.3%) జంప్‌చేస్తే, మిడ్‌క్యాప్‌ 2,939 పాయింట్లు(7.6%) బలపడింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు తలెత్తినప్పటికీ దేశీయంగా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు, విధానాల కొనసాగింపుపై అంచనాలు ఇన్వెస్టర్లలో మార్కెట్లపట్ల విశ్వాసాన్ని పెంచాయి. ఫలితంగా గతేడాది పలు ఆటుపోట్ల మధ్య మార్కెట్లు నికరంగా లాభపడ్డాయి.

ఇదీ చదవండి: రెండేళ్లలో తొలిసారి ధరలు పెంపు

ట్రంప్‌ సుంకాలపై ఏప్రిల్‌ 2న మరింత స్పష్టత రాబోతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సుంకాల ప్రభావం ఆటో, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలపై ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా టారిఫ్‌ల వార్తలు మార్కెట్‌ సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి. దీనికి తోడు ముడిచమురు ధరలు పెరగడం, అమెరికా డాలర్ బలపడటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఇటీవల నికర కొనుగోలుదారులుగా మారడం కొంత కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement